Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రీ ఎంట్రీ... రైతు బిడ్డ రియాక్షన్ ఏంటంటే?
Bigg Boss Telugu 7: దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లోనూ ఈ షో అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ విజయవంతంగా సాగుతుంది. ముఖ్యంగా అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా ప్రత్యేకంగా ఉండడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అందులో ప్రతీ రోజూ రాత్రి 9 గంటలకు టీవీ ముందు వాలిపోతూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీకెండ్స్, నామినేషన్స్ అప్పుడు అయితే మరింత ఎక్కువ మంది టీవీలు చూస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 7 ఉల్లా పుల్టాగా సాగుతుండడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా షోను చూస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను మాత్రమే ఇంట్లోకి పంపిన బిగ్ బాస్ 5 మంది ఎలిమినేట్ అయిపోగానే.. మరో ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపాడు. ఈక్రమంలోనే అలా మరో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారో లేదో... గతంలో వెళ్లిపోయిన మరో లేడీ కంటెస్టెంట్ ను తిరిగి ఇంట్లోకి తీసుకు వచ్చారు.

అయితే గతంలో ఇంట్లోంచి వెళ్లిపోయిన దామిని, శుభ శ్రీ, రతికా రోజ్ లలో.. హౌస్ లోని కంటెస్టెంట్లు అంతా ఓట్లు వేసి ఎవరిని గెలిపిస్తే వారిని ఇంట్లో పంపిస్తామని చెప్పారు. ఇలా ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహించారు. చివరకు ఓట్లు తక్కువ వచ్చిన వారిని లోపలికి తీసుకురాబోతున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చారు. ఈరోజు పూజా మూర్తి ఎలిమినేట్ కాగానే.. రతికను ఇంట్లోకి పంపించారు. ఆమె లోపలికి అడుగు పెట్టగానే.. శివాజి ఎదురు పడ్డాడు. దీంతో రతిక చాలా హ్యాపీగా ఫీలైంది. వెంటనే వెళ్లి శివాజిని గట్టిగా హత్తుకుంది.
రతిక వచ్చినట్లు గుర్తించిన కంటెస్టెంట్లు అందరూ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక్క పల్లవి ప్రశాంత్ మాత్రమే లోపల కిచెన్ లో ఉండిపోయాడు. అంతా వచ్చి చాలా సేపు మాట్లాడాకా కానీ అతడు బయటకు రాలేదు. వచ్చినప్పటికీ.. రతిక అతడిని చూసీ చూడనట్లుగానే వ్యవహరించింది. దీంతో ప్రశాంత్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత రతిక శివాజిని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆయన కాళ్లు పట్టుకొని మరీ క్షమించమని అడిగింది. అందుకు అలా వద్దమ్మా, తప్పు తెలుసుకున్నావ్ గా అంతే చాలంటూ పైకి లేపాడు.

ఇక ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఓ గులాబ్ జామున్ డబ్బాతో రతికా వద్దకు వచ్చాడు. ఆమెకు తనిపించబోయాడు. ఆమె ఇది లగ్జరీ బడ్జెట్ హా, తినొచ్చా, ఏమీ అనరా అంటూ ప్రశ్నలు వేసింది. దీనికి పల్లవి ప్రశాంత్ ఏం పర్లేదు అని చెప్పగా ఆమె ఆ గులాబ్ జామున్ తినేసింది. ఇదంతా చూస్తుంటే.. రతిక, పల్లివి ప్రశాంత్ పై కోపం తగ్గించుకున్నట్లుగానే అనిపిస్తోంది. ఆమె చేసిన తప్పు తెలుసుకొని అతడితో బాగా ఉంటే.. మరిన్ని వారాలు ఆమె ఇంట్లో ఉంటుంది. గతంలో లాగే పల్లవి ప్రశాంత్ పై విరుచుకు పడితే మళ్లీ బయటకు వచ్చేస్తుందని అంతా అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











