Bigg Boss Telugu 7: ఇది కదా అసలైన ఉల్టా పుల్టా అంటే - అతి తక్కువ ఓట్లు వచ్చిన రతికా రీఎంట్రీ!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్.. ఈ షో పేరు వింటేనే చాలా మంది తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ఇక సీజన్ ప్రారంభం అవుతుందంటే చాలు అందులోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు హోస్ట్ చేస్తున్నారని వంటివి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అయిపోయే వరకు రోజూ రాత్రి 9 గంటలకు టీవీ ముందు వాలిపోతుంటారు. ఇక బిగ్ బాస్ తెలుగు 7 ఉల్లా పుల్టాగా సాగుతుండడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా షోను చూస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను మాత్రమే ఇంట్లోకి పంపిన బిగ్ బాస్ ఐదుగురు ఎలిమినేట్ అయిపోగానే.. మరో ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపాడు. ఇక ఇప్పుడే షో మొదలైంది అనుకునే వారం సాగే లోగానే మరో షాకింగ్ డిసీషన్ తో ముందుకొచ్చాడు బిగ్ బాస్. గతంలో ఎలిమినేట్ అయిన రతికా రోజ్, దామిని, శుభ శ్రీలను బిగ్ బాస్ స్టేజీపైకి తీసుకొచ్చాడు. హౌస్ లోని కంటెస్టెంట్లు అంతా ఓట్లు వేసి ఎవరిని గెలిపిస్తే వారిని ఇంట్లో పంపిస్తామని చెప్పారు. ఇలా ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహించారు.

Bigg Boss Telugu 7 Rathika Rose Re Entry in Seventh Week

అయితే కంటెస్టెంట్లు అందరూ తమకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటు వేశారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. ఓట్లు ఎక్కువ వచ్చిన వారి కంటే కూడా తక్కువ వచ్చిన వారినే రీఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపిస్తామన్నారు. దీంతో కంటెస్టెంట్లు అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఇదంతా చూస్తుంటే రతికా రోజ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందరి కంటే తక్కువ ఓట్లు ఆమెకే వచ్చాయని సమాచారం. ఎన్నెన్నో గొడవల తర్వాత హౌస్ లోంచి వెళ్లిపోయిన రతికా మరోసారి ఇంట్లోకి వస్తుందంటే సీన్ ఎలా ఉంటబోతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ముఖ్యంగా రతికా రోజ్.. పల్లవి ప్రశాంత్, శివాజీలతో వ్యవహరించి తీరుపై తీవ్ర స్థాయిలో నెగిటివిటీ వచ్చింది. అయితే దాన్ని తొలగించుకొని మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకోవాలని రతికా చాలానే ప్రయత్నాలు చేస్తోందట. ఈక్రమంలోనే బిగ్ బాస్ మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆమెకు ప్లస్సుగా మారిందని అంతా అనుకుంటున్నారు. గతంలో మాదిరిగానే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఇంటిని షేక్ చేస్తుందో, ఎవరితో ఏ స్థాయిలో గొడవలు పెట్టుకుందోనని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Bigg Boss Telugu 7 Rathika Rose Re Entry in Seventh Week

రతికా రోజ్ ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఏ స్థాయిలో కోరుకున్నారో అదే స్థాయిలో ఆమె మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు. నిజానికి ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయినప్పటి నుంచి షో అంత ఆసక్తిగా లేదని చాలా మంది భావన. ఈక్రమంలోనే బిగ్ బాస్ కూడా మరోసారి హాట్ బ్యూటీ రతికా రోజ్ ను ఇంట్లోకి పంపి షోను మరింత రసవత్తరంగా మార్చనున్నట్లు సమాచారం. మరి ఈ క్యూట్ బ్యూటీ ఎప్పుడు ఇంట్లోకి రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X