అమర్‌దీప్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్: 15 వారాల్లోనే ఏకంగా అన్ని లక్షలు.. దానికి మించిన మరో సర్‌ప్రైజ్
సామాన్యులను సైతం సెలెబ్రిటీలుగా మార్చే షోలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్‌ను సొంతం చేసుకుంది.
ఫలితంగా నిర్వహకులు వరుస సీజన్లతో అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని విజయవంతంగా ముగించారు. మరి ఇందులో రన్నర్‌గా నిలిచిన అమర్‌దీప్ చౌదరికి రెమ్యూనరేషన్‌గా ఎంత వచ్చింది అనే దానిపై ఓ లుక్కేద్దాం పదండి!

ఘనంగా ముగిసిన సీజన్: ఎవరూ ఊహించని విధంగా ఉల్టా పుల్టా కాన్సెప్టుతో మొదలైన బిగ్ బాస్ ఏడో సీజన్ 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఇందులో చిత్ర విచిత్రమైన సన్నివేశాలను చూపించి నిర్వహకులు వినోదాన్ని పంచారు. ఈ క్రమంలోనే గత ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. దీన్ని ఎంతో సందడిగా జరిపించి షోను విజయవంతంగా ముగించేశారు.

ప్రశాంత్ విన్.. అమరేమో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా వచ్చారు. వీరిలో అంబటి అర్జున్ ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా వెళ్లిపోయింది. ప్రిన్స్ యావర్ 15 లక్షలు తీసుకుని తప్పుకున్నాడు. ఆ తర్వాత శివాజి కూడా ఎలిమినేట్ అయిపోయాడు. చివరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. అమర్‌దీప్ రన్నర్‌గా మిగిలిపోయాడు.

అమర్ రెమ్యూనరేషన్: బిగ్ బాస్ హౌస్‌లోకి భారీ అంచనాలతో వచ్చి.. అందుకు తగ్గట్లే ఆడుతూ రన్నరప్‌గా నిలిచాడు సీరియల్ హీరో అమర్‌దీప్ చౌదరి. దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. అమర్ ఒక్కో వారానికి రూ. 2.50 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని తెలిసింది.
మొత్తం అన్ని లక్షలతో: బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. అమర్‌దీప్ బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకు రూ. 35 వేలకు పైగానే వసూలు చేసినట్లు తెలిసింది. అలా అతడు ఒక్క వారానికి గానూ రూ. 2.50 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడని సమాచారం. ఇక, 15 వారాల పాటు ఉన్న అమర్‌దీప్ మొత్తంగా రూ. 37.50 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

శివాజి తర్వాత అతడే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో కొందరు ఎక్కువ రెమ్యూనరేషన్‌తో వచ్చినా ఎన్నో వారాలు కొనసాగలేకపోయారు. దీంతో ఈ సీజన్‌లో శివాజినే ఎక్కువ రెమ్యూనరేషన్ పొందిన కంటెస్టెంట్‌గా నిలిచాడు. అతడికి మొత్తంగా రూ. 60 లక్షలకు పైగానే డబ్బు వచ్చింది. శివాజి తర్వాత అమర్‌దీప్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా నిలిచాడు.

సర్‌ప్రైజ్ ఆఫర్ కూడా: అమర్‌దీప్ చౌదరి ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో అతడికి రెమ్యూనరేషన్ మినహా ఏమీ దక్కలేదని ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. అయితే, ఈ సీరియల్ హీరో త్వరలోనే తన అభిమాన కథానాయకుడైన మాస్ మహారాజా రవితేజ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ స్టార్ హీరోనే గ్రాండ్ ఫినాలే వేదికపై ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











