Bigg Boss Telugu 7: చరిత్రలోనే తొలిసారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై పుస్తకం..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఎంత అద్భుతంగా సాగిందో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్, చుక్క బ్యాచ్, స్పా బ్యాచ్ చేసిన రచ్చ వాళ్లు ఆడిన ఆట తీరుతో మరింత ఎక్కువ మంది షో చూశారు. ముఖ్యంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన వారే ఈ బిగా బాస్ తెలుగు 7 షో. అయితే ఈ సారి సీజన్ లో ఎక్కువగా స్పా, స్పై బ్యాచ్ ల మధ్య గొడవలే హైలెట్ గా నిలిచాయి. ఈ రెండు బ్యాచ్ లలో నుంచే టాప్ 5 కంటెస్టెంట్లు అవుతారని కూడా అంతా అనుకున్నారు. ఫైనల్ గా కూడా అదే జరిగంది. అయితే అంతా ఊహించినట్లుగానే విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అలాగే రన్నరప్ గా అమర్ దీప్ గెలిచాడు.
విన్నర్ గా నిలుస్తాడని చాలా మంది బావించిన శివాజి మాత్రం టాప్ 3 కి పడిపోయాడు. దీన్ని చాలా మంది అసలు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా అమర్ దీప్ కు 2వ స్థానాన్ని ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే స్టార్ మా బ్యాచ్ వాళ్లు అమర్ దీప్ ను గెలిపించుకున్నారని ట్రోల్స్ చేశారు. ఇంత పెద్ద రచ్చకు తెర తీసిన ఈ షో అయిపోయిన తర్వాత కూడా పెద్ద గొడవే అయింది. రైతుబిడ్డ ఫ్యన్స్ కార్లపై దాడి చేయడం, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవడం.. బయటకు రావడం ఇలా పెద్ద రచ్చే అయింది. అయితే బిగ్ బాస్ షో తర్వాత నుంచి అమర్ దీప్ ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా అంతా కలిసి పార్టీలు చేసుకుంటున్నా ఇతడు మాత్రం దూరంగానే ఉంటున్నాడు.

అయితే తాజాగా సీరియల్ బ్యాచ్ కు చెందిన శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, అంబటి అర్జున్ లు ఒక్క స్టేజీ మీదకు వచ్చారు. వీరంతా కలిసి రాకపోయినా ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ అంటూ న్యూ ఇయర్ సందర్భంగా చేసిన స్పెషల్ ఈవెంట్ లో వీళ్లు పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఆ షోకు వచ్చిన కొందరు ఆడియన్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా బిగ్ బాస్ అసలైన విన్నర్ పల్లవి ప్రశాంత్ కాదని.. తమ అభిమాను కంటెస్టెంట్ యే విన్నర్ అంటూ రచ్చ చేశారు. అయితే ఆ విన్నర్ ఎవరో, అసలు ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ న్యూ ఇయర్ ఈవెంట్ కు సంబంధంచిన ప్రోమో తాజాగా విడుదల అయింది. ఈ ప్రోమోలో అమర్ దీప్ ఫ్యాన్స్ స్టేజీ మీదకు వచ్చారు. అమర్ దీప్ ఎంట్రీ కాగానే... వాళ్లు తెగ సందడి చేశారు. అన్నా అందరికీ మీరు రన్నర్ అవ్వొచ్చు.. కానీ మాకు మాత్రం మీరెప్పుడూ విన్నరే అంటూ ఓ అభిమాని చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అమర్ అన్న తోపు దమ్ముంటే ఆపు అంటూ కూడా ఓ డైలాగ్ చెప్పి అందరిలోనూ ఊపు తెచ్చాడు. ఇక ఆ తర్వాత ఓ బుక్ ను రిలీజ్ చేశారు.

అయితే ఆ పుస్తకం అమర్ దీప్ కు సంబంధించిందట. ఆయన గురించి రాసిన ఆ పుస్తకాన్ని యాంకర్ శ్రీముఖి చూపించింది. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీద ఒక బుక్ వచ్చింది అంటే మా తమ్ముడు నిజంగా సాధించాడురా అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఆ బుక్ ను ఓపెన్ చేసి చూస్తూ.. ఆద్య, రేష్మ అంటూ కొంత మంది అమ్మాయిల పేర్లు చెప్పింది. ఈ పుస్తకంలో మొత్తం అమ్మాయిల పేర్లే ఉన్నాయంటూ కామెడీ చేసింది. ఆ తర్వాత తేజూ చేతిలో సచ్చావురా నువ్వు అంటూ నవ్వులు పూయించింది. పూర్తి ఎపిసోడ్ చూస్తే మీకు మరిన్ని ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











