Bigg Boss Telugu 7:ప్రశాంత్ ఫ్యాన్స్‌కు అమర్‌దీప్ రిక్వెస్ట్..నన్నేమైనా చేయండి కానీ వాళ్ల జోలికి రావొద్దంటూ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాస్క్ లు అంతకు మించిన ఆట తీరుతో తెగ అలరింపజేశారు. అయితే ఇటీవలే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరిగ్గా.. అక్కడే విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్.. రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ పై, ఆయకు కుటుంబ సభ్యులపై.. ముఖ్యంగా కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అశ్విని శ్రీ కారుతో పాటు గీతూ రాయల్ కార్లు కూడా ధ్వంసం అయ్యయి. ముఖ్యంగా అమర్ దీప్ వెళ్తున్న కారు అద్దాలన్నీ పగిలిపోయి.. లోపల ఉన్న వాళ్ల అమ్మకు పెంకులు కుచ్చుకుపోయాయట. కేవలం వీరి మీదే కాకుండా ఆరు తెలంగాణ ఆర్టీసీ బస్సులపై కూడా దాడులకు పాల్పడ్డారు.
అమర్ దీప్ లక్ష్యంగా జరిగిన ఈ దాడులపై ఇప్పటికే కేసులు కూడా నమోదు అయ్యాయి. అటు ఆర్టీసీ యాజమాన్యం ఇటు అశ్విని శ్రీ, మరోవైపు గీతూ రాయల్ లు.. ఇలా అందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే పోలీసులు కూడా సుమోటోగా కేసును స్వీకరించన పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానులపై కూడా ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ ఘటనపై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తూనే ఉన్నారు. రైతుబిడ్డ ప్యాన్స్ ఇలా చేసి ఉండేది కాదంటూ వివరిస్తున్నారు. అయితే తాజాగా అమర్ దీప్ దీనిపై స్పందించాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు తనపై దాడి చేయడం గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆయన ఏం అన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ మొదలెట్టిన అమర్ దీప్.. మీరెంతో ప్రేమతో నన్ను ఇక్కడి వరకూ తీసుకు వచ్చారు, ఇంట్లో వాడిలా ఆదరించారంటూ చెప్పుకొచ్చారు. గెలవేలను అనుకున్న వాడిని గెలుపు అంచుల వరకూ తీసుకు వచ్చారంటే అదంతా మీ వల్లే అంటూ అమర్ దీప్ వివరించాడు. అలాగే నిన్నటి నుంచి అందరూ తనపై జరిగిన దాడి గురించి అడుగుతున్నారని... అలాంటి బాధాకరమైన దాని గురించి తనకు మాట్లాడడం కూడా ఇష్టం లేదని అమర్ దీప్ తెలిపాడు. ముఖ్యంగా ఆ బాధలోంచి తేరుకోవడానికి తనకు ఇంత సమయం పట్టిందని క్లారిటీ ఇచ్చాడు.
గెలిచిన ఆనందంలో ఉన్న నేను బయటకు రాగానే షాకింగ్ గా... కారు అద్దాలు పగులగొట్టి, బయటకు రా నీ అంతు చూసస్తామంటూ అన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఒంటరిగా, ఒక్కడినే ఉన్నప్పుడు ఏమైనా చేసుకోండి.. నేనేం భయపడను కానీ.. నా ఫ్యామిలీ నా వెంట ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అంటూ తెలిపాడు. కారు అద్దాలు పగులగొట్టినప్పుడు ఆ పెంకులు అన్నీ తన అమ్మకు కుచ్చుకున్నాయని... అదృష్ట వశాత్తు ఎవరికీ ఏమీ జరగలేదని చెప్పాడు. మీరు విసిరిన రాళ్ల వల్ల ఎవరికైనా గట్టి దెబ్బలు తగిలి తలలు పగిలిపోయి ఉంటే.. నేను చాలా కోల్పోయేవాడిని మీరలా చేసి ఉండకూడదు అంటూ అమర్ దీప్ అన్నాడు.
నా మీద కోపం ఉంటే తిట్టండి పడతాను, కామెంట్లు పెట్టండి చూస్తాను.. మరీ కోపం ఉంటే వీడియోలు కూడా చేసి పెట్టండి అంటూ అమర్ దీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా వీడియోలు పెట్టారు, నేను చూశాను.. కానీ వాటిని పట్టించుకోవాలని అనుకోవట్లేదంటూ చెబుతున్నాడు. ఆడవాళ్లు, పెద్దలు, వృద్ధులు మన వెంట ఉన్నప్పుడు ఏదైనా చేసే ముందు కాస్త ఆలోచించాలి అంటూ వేడుకున్నాడు. తనమీద కోపం ఉంటే ఏం చేసినా పర్లేదు అని.. తన వాళ్ల జోలికి రావద్దూ అంటూ ఓ వీడియో విడుదల చేశాడు.


Click it and Unblock the Notifications











