Amardeep: తండ్రి కాబోతున్న అమర్ దీప్.. ఫ్లోలో సీక్రెట్‌ను ముందే రివీల్ చేసిన యాంకర్!

బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అమర్ దీప్ చౌదరి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా సీరియల్ హీరోగా కెరియర్ ప్రారంభించిన ఈయన అలా విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్నాడు. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు 7కి వెళ్లాడు. అక్కడే తనలోని చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని చూపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై కోపాన్ని చూపించి విపరీతమైన నెగిటివిటీని కూడా సంపాధించుకున్నాడు.

ఇవి మాత్రమే కాకుండా సీరియల్ నటి తేజస్విని పెళ్లి చేసుకున్న ఈయన.. ఆమెపై తనకు ఉన్న ప్రేమను అందరికీ అర్థం అయ్యేలా చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండగా చాలా సార్లు తన భార్య తేజు మీద ఉన్న ప్రేమ, అభిమానాన్ని వివరించాడు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈయన ప్రస్తుతం తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. యాంకర్ శ్రీముఖి ఈ విషయాన్ని ఫ్లోలో ముందుగానే చెప్పేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss Telugu 7 Runner Up Amardeep Chowdaty Going to Be Father Check Details

బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరి.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పాజిటివిటీతో పాటు నెగిటివిటీని కూడా సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ ఫినాలే రోజే రైతుబిడ్డ ఫ్యాన్స్ అనేక మంది ఇతగాడి కారుపై దాడి చేశారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య, తల్లి ఉన్నారని కూడా చూడకుండా కారు అద్దాలను పగలగొట్టారు. దీంతో చాలా బాధ పడిపోయిన అమర్ దీప్ ఆ తర్వాత తన భార్య, తల్లి జోలికి రాకుండా తనను ఏం చేసినా ఫర్వాలేదని వీడియో రిలీజ్ చేశాడు. ఇదంతా చూస్తుంటేనే ఆయనకు తల్లి, భార్య అంటే ఎంత ప్రేమో అర్థం అవుతుంది.

అయితే తాజాగా అమర్ దీప్ చౌదరితో పాటు ఆయన భార్య తేజస్విని గౌడ వాలంటైన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఓ షోకు హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే అనేక బుల్లితెర జంటలు ఈ షోలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖియే ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా.. అందులో జంటలు అన్నీ తెగ రొమాన్స్ చేశాయి. జంటలు అందరి చేత రొమాంటిక్ గా చాక్లెట్లు కూడా తనిపించారు.

Bigg Boss Telugu 7 Runner Up Amardeep Chowdaty Going to Be Father Check Details

ఈక్రమంలోనే షోలో పాల్గొన్న జంటలు అందరి గురించి మాట్లాడుతూ.. మీరెప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారని ఓ జంటను అడిగింది. అలాగే పక్కేనే ఉన్న జంటలను చూపిస్తూ.. వాళ్లకు ఇప్పటికే పిల్లలు పుట్టారని కొందరి పేర్లు చెప్పింది. ఆ తర్వాత అమర్ దీప్, తేజస్వినిలు త్వరలోనే తల్లదండ్రులు కాబోతున్నారంటూ వివరించింది. ఇలా అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడే విషయాన్ని లీక్ చేసింది యాంకర్ శ్రీముఖి.

అయితే నిజంగానే తేజస్విని గర్భం దాల్చింది... అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడా అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ముఖ్యంగా ఈ సీక్రెట్ ను రివీల్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఉత్తిగా ఇలా అనిందా.. నిజంగానే అనిందా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్లు చెప్పినా, చెప్పకపోయినా మరికొన్ని రోజుల్లోనే ఈ విషయం నిజమా కాదా అనేది అందరికీ తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X