కిడ్నాపర్‌గా మారిన అమర్‌దీప్.. రీల్ లైఫ్‌లో కాదు రియల్ లైఫ్‌లో.. ఆ కుర్రాడిని ఎత్తుకెళ్లిన వీడియో వైరల్!
బిగ్ బాస్ షో గురించి అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు, హోస్ట్ ల గురించి తెలుసుకునేందుకు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉంటారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు అందరూ ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ కాగా, మరికొందరి ప్రయత్నాలు మాత్రం బెడిసి కొడతాయి. అయితే తాజాగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ కిడ్నాపర్ గా మారాడు. ఓ కుర్రాడిని కిడ్నాప్ చేస్తూ ఓ వీడియోకు చిక్కగా.. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. అయితే కిడ్నాపర్ గా మారిన కంటెస్టెంట్ ఎవరో, ఎందుకు కిడ్నాప్ చేశాడు వంటి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 గురించి... ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరి గురించి తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా తెలుసు. ముఖ్యంగా ఈ షోలో టాప్ 5కు వచ్చిన వారు విన్నర్, రన్నరప్ లు రెండు తెలుగు రాష్ట్రాల వారందరికీ సుపరిచితమే. అయితే ఈ సీజన్ రన్నరప్ గా నిలిచిన సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి తాజాగా కిడ్నాపర్ గా మారాడు. అయితే బిగ్ బాస్ షోలో ఉండగా.. పిల్లాడి మనస్తత్వంతో ఉన్నట్లు కనిపించిన ఈయన విపరీతమైన నెగిటివిటీని మూట కట్టుకున్నాడు.

ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ లతో సరిగ్గా ఉండకపోవడంతో ఈయనకు నెగిటివిటీ పెరిగింది. అదే గ్రాండ్ ఫినాలే ఈవెంట్ రోజు జరిగిన దాడులకు కారణం అయింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కున్న ఈయన ఇటీవలే ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ముఖ్యంగా హీరోగా మారాడు అనుకునే లోపు ఈయన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈయన కిడ్నాపర్ గా ఎందుకు మారుడు, ఎవరిని కిడ్నాప్ చేశాడో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.
అమర్ దీప్ చౌదరి.. కిడ్నాపర్ గా మారి కిడ్నాప్ చేసింది మరెవరినో కాదు తన తోటి కంటెస్టెంట్ ను. అది కూడా టేస్టీ తేజను. అయితే టేస్టీ తేజ ఎప్పటికప్పుడు కొత్త కొత్త హోటల్స్ లో ఫుడ్ తింటూ వాటిపై వ్లాగ్ లు చేస్తుంటాడు. అంతేనా రీవ్యూలు ఇస్తూ.. సినిమా వాళ్లను ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. ఇలా చాలా మంది గెస్టులకు అదిరిపోయే భోజనాలు పెట్టించాడు. అయితే తొలిసారి టేస్టీ తేజకు అదిరిపోయే భోజనం పెట్టించాలని ఫిక్స్ అయిన అమర్ దీప్ టేస్టీ తేజను కిడ్నాప్ చేశాడు. నేరుగా ఓ హోటల్ కు తీసుకెళ్లి ఫుల్ గా భోజనం పెట్టించాడు.

ఇదంతా ఏంట్రా, నన్ను ఎక్కడికి తీసుకు వచ్చావు, ఏం తినిపిస్తున్నావో చెప్పమన్నా చెప్పకుండా చాలా సేపు ఆట పట్టించాడు అమర్ దీప్. చివరకు ఇది తినురా అనే హోటల్ అని చెప్పి అతడికి కడుపు నిండా భోజనం పెట్టించాడు. అదెలా ఉందో చెప్పమంటూ అడగ్గా.. అన్నీ అదిరిపోయాయంటూ టేస్టీ తేజ ఆవురావురుమంటూ బిర్యానీనీ లాగించేశాడు. ఈ వీడియోను అమర్ దీప్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేధికగా అభిమానులతో పంచుకోగా క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











