Amardeep: నా కారు పగులగొట్టినా అందుకే కంప్లైంట్ చేయలేదు, పల్లవి ప్రశాంత్ అరెస్టుపై నోరు విప్పిన అమర్‌దీప్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ షోలో టాప్ 6లో నిలిచిన వాళ్లతో పాటు విన్నర్, రన్నరప్ లను ఎవరూ మర్చిపోలేరు. కేవలం విజేతలుగా మాత్రమే కాదు ఆ తర్వాత జరిగిన అనేక విషయాల గురించి కూడా అంతా గుర్తు పెట్టుకుంటారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు.. విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్.. రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ పై, ఆయకు కుటుంబ సభ్యులపై.. ముఖ్యంగా కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మరికొంత మంది కార్లను పగులగొట్టారు. ఆర్టీసీ బస్సులను సైతం వదల్లేదు.
దీనిపై పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అశ్విని శ్రీ, గీతూ రాయల్ వంటి వాళ్లు కూడా తమ కార్లు పగులగొట్టిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసినందుకు గాను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానులపై కూడా చర్యలు తీసుకోవాలని చాలా మందే కోరారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పోలీసుల పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రెండు, మూడు రోజులకు ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు.

అయితే ఇంత పెద్ద గొడవ జరగడం... ముఖ్యంగా అమర్ దీప్ ను టార్గెట్ చేసుకుని జరగడం అందరికీ తెలిసిందే. అయితే ఎవరెవరో పోలీసులకు ఫిర్యాదు చేసినా అమర్ దీప్ మాత్రం తనపై జరిగిన దాడికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీంతో వీరిపైనే నెగిటివిటీ పెరిగిందే. కావాలని వారు దాడి చేయించుకున్నారని... అందుకే వారిలో ఒక్కరికి కూడా గాయాలు కూడా కాలేవని కూడా పెద్ద చర్చ సాగింది. అయితే దీనిపై అమర్ దీప్ తొలిసారిగా స్పందించాడు. అమర్ దీప్ స్నేహితుడు నరేష్ లొల్ల యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చారు.
తనపై దాడి జరిగిన క్షణం తనకేం అర్థం కాలేదని.. అప్పుడే తాను కారు దిగిపోతానని గొడవ చేసినట్లు గుర్తు చేశాడు. భార్య, తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్తే చాలని నరేష్ లొల్లను అడిగినట్లు వివరించాడు. ఆ క్షణం తన ఫ్యామిలీని సేవ్ చేయడమే తనకు కావాలనిపించిందని చెప్పుకొచ్చాడు. అందుకే రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడలేదని.. ఆ గొడవను మరింత పెద్దది చేయడం కూడా ఇష్టం లేకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని వివరించాడు. అలాగే అందరూ తనవల్లే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని అనుకున్నారని.. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చాడు.

అసలు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడానికి కారణం.. ఆయన పోలీసులు చెప్పిన మాట వినకపోవడమే అని.. పోలీసులపైనే ఫైర్ అవ్వడం.. పరిస్థితి చేయి దాటి పోవడం వల్లే అరెస్ట్ అయ్యాడని వివరించారు. ఇప్పటికైనా తన ఫ్యామిలీ జోలికి రావొద్దని.. కావాలంటే తనను ఎంతైనా ట్రోల్ చేసుకోవచ్చని, ఏమైనా అనొచ్చని అమర్ దీప్ స్పష్టం చేశాడు. తాజాగా వచ్చిన ఈ ఇంటర్వ్యూను చూసేందుకు చాలా మందే ఆసక్తి కనబరుస్తున్నారు. పూర్తి వివరాల కోసం మీరూ ఓసారి ఈ వీడియోను చూసేయండి.


Click it and Unblock the Notifications











