Amardeep: అమర్‌దీప్‌తో సురేఖా వాణి రిలేషన్.. అందుకే సుప్రితతో సినిమా చేస్తున్నాడా?
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్, రన్నరప్ అమర్ దీప్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఫౌల్ గేమ్స్, గ్రూపు గేమ్ ఆడుతూ.. టాప్ 2కి వచ్చిన ఈయన బిగ్ బాస్ తర్వాత హీరోగా మారాడు. ముఖ్యంగా నటి సురేఖా వాణి కూతురు సుప్రితతో కలిసి సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా తనకు సురేఖావాణితో ఉన్న బంధాన్ని బయట పెట్టాడు. అందుకే తాను సుప్రితతో కలిసి సినిమా చేస్తున్నట్లు వివరించాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మౌనరాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్... ఆ తర్వాత బిగ్ బాస్ షోకు వచ్చి నెగిటివిటీని సొంతం చేసుకన్నాడు. కానీ తన నిజమైన అభిమానుల సాయంతో రన్నరప్ గా నిలిచాడు. ఆ తర్వాత అనేక సమస్యలు ఎదుర్కున్నాడు. కానీ వాటన్నిటి నుంచి తేరుకుని.. హీరోగా మారాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా తొలిసారి తన సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేశాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటి సురేఖా వాణి కూతురు సుప్రితను తీసుకున్నారు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాకపోయినా.. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన అప్ డేట్లను సుప్రిత వెల్లడిస్తూనే వస్తోంది. అయితే తాజాగా అమర్ దీప్, సుప్రితలు కలిసి దావత్ షోకు వచ్చారు. ఇక్కడే అమర్ దీప్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ముఖ్యంగా తనకు నటి సురేఖా వాణితో ఉన్న బంధాన్ని రివీల్ చేశాడు.
నటి సురేఖా వాణి, సుప్రితలు తనకు బంధువులు అవుతారని.. వరుసకు సురేఖా వాణి అక్క అవుతుందని అమర్ దీప్ వెల్లడించాడు. అలాగే సుప్రిత తనకు మేన కోడలు అవుతుందని చెప్పాడు. ఇదంతా విన్న దావత్ షో యాంకర్ రీతూ చౌదరి షాక్ అవ్వగా.. ఓసారి అమర్ దీప్ ను మావయ్యా అని పిలువు అంటూ చెప్పింది. దీంతో అందాల ముద్దుగుమ్మ సుప్రిత చాలా స్టైల్ గా, క్యూట్ గా మావయ్యా అంటూ అనేసింది. దీంతో అమర్ దీప్ తెగ సిగ్గు పడిపోయాడు.

ఇక ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. సుప్రితతో సినిమా చేయడానికి గల కారణం చెప్పాడు. తాను చేయబోయే సినిమా కథకు సుప్రిత బాగా సెట్ అవుతుందని.. అందుకే ఆమెతో సినిమాకు ఓకే చెప్పానని అన్నాడు. అలాగే తన కాలేజీ రోజులు గుర్తు చేసుకుని ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. ఇవి మాత్రమే కాకుండా.. యాంకర్ రీతూ చౌదరి అమర్ దీప్, సుప్రితలకు సంబంధిన అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ షో చూసేయండి.


Click it and Unblock the Notifications











