Bigg Boss Telugu 7 ప్రారంభం ఎప్పుడంటే? కొత్త హోస్ట్ పేరు తెరపైకి? ఏ రోజు నుంచి స్టార్ట్ అంటే?

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన రియాలిటీ షోలలో బిగ్‌బాస్ తెలుగు ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. గత 6 సీజన్లకు వచ్చిన రేటింగ్, స్పందన చూస్తే బిగ్‌బాస్ తెలుగు షోకు ఉన్న ఆదరణ ఏమిటో తెలిసిపోతుంది. గతేడాది బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్‌ను దిగ్విజయంగా ముగించుకొన్న ఈ రియాలిటీ షో మరోసారి సరికొత్త ఫార్మాట్‌తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో ఎప్పుడు? ఎక్కడ ప్రారంభమవుతుందనే వివరాల్లోకి వెళితే..

కంటెస్టెంట్ల ఎంపిక విధానం:బిగ్‌బాస్ తెలుగు 7 విషయానికి వస్తే.. సెలబ్రిటీల ఎంపిక కార్యక్రమం నిదానంగానే మొదలైందనే చెప్పాలి. ఇంకా పూర్తి స్థాయిలో సెలబ్రిటీల ఎంపిక జరగడం లేదు. కానీ చాలా మంది సెలబ్రిటీల పేర్లను పరిశీలిస్తున్నారు. ఫైనల్ జాబితాను బిగ్‌బాస్ నిర్వాహకులు చేయలేదు అనే విషయం స్పష్టమైంది. కంటెస్టెంట్ల ప్రాబబుల్స్ జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

Bigg Boss Telugu 7 season getting ready for stream: Here is the start date details

సెలబ్రీటీల ఎంపిక జూన్ నుంచి:ఇక బిగ్‌బాస్ తెలుగు 7 షో కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. చాలా పేర్లు మీడియాలో వినిపిసున్నప్పటికీ.. ఆ సెలబ్రిటీలే స్వయంగా ఖండించడంతో.. ఈ సీజన్‌లో ఎవరెవరు ఉంటారనే విషయం ఆసక్తిగా మారింది. కంటెస్టెంట్ల ఎంపిక జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారం నుంచి వేగమందుకోవచ్చని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.

Bigg Boss Telugu 7 season getting ready for stream: Here is the start date details

బిగ్‌బాస్ తెలుగును మరింత ఆకర్షణీయంగా :బిగ్‌బాస్ తెలుగు 7 షోను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ సారి కొన్ని కొత్త రూల్స్, కొత్త రకమైన గేమ్ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఇంకా బిగ్‌బాస్ సెట్ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభ కాకపోవడంతో షో ప్రారంభం కావడానికి సమయం ఉందనే విషయం స్పష్టమైంది.

Bigg Boss Telugu 7 season getting ready for stream: Here is the start date details

బిగ్‌బాస్ తెలుగు 7 స్టార్ట్ ఎప్పుడంటే?:అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 7 షో ఎప్పటి లానే సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నదని తెలిసింది. బిగ్‌బాస్ తెలుగు 7 షో సెప్టెంబర్ 3వ తేదీన గానీ, లేదా సెప్టెంబర్ 10వ తేదీన గానీ ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ మొదటి ఆదివారం గానీ, సెప్టెంబర్ రెండో ఆదివారం రోజున ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

Bigg Boss Telugu 7 season getting ready for stream: Here is the start date details

బిగ్‌బాస్‌కు కొత్త హోస్ట్ రానున్నాడా? :బిగ్‌బాస్ గత 6 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన ప్రముఖుల గురించిన విషయంలోకి వెళితే.. తొలి సీజన్‌ను ఎన్టీఆర్ జూనియర్ ప్రారంభించగా.. ఆ తర్వాత నాని రెండో సీజన్‌ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున ఈ షోను తన హోస్టింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజా వార్తల ప్రకారం నాగార్జున అక్కినేని ఈ సీజన్‌కు అందుబాటులో ఉండకపోవచ్చనేది ప్రచారం జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X