Bigg Boss Nominations: 7వ వారంలో 8 మంది నామినేట్.. అతడికి గుద్ది పడేశారు.. ఆమె వస్తే ఉల్టా పుల్టానే!
సాదాసీదాగానే తెలుగు బుల్లితెరపైకి పరిచయమైనా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. నిజమైన అంశాల ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం ఎవరూ ఊహించని రీతిలో స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా దేశంలో ఏ షోకూ రానంత రేటింగ్‌తో దుమ్ము దులుపుతోంది. దీంతో తెలుగులో ఇటీవలే ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడిచే ఈ సీజన్ మజాను పంచుతూ సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ఏడో వారంలో జరిగిన నామినేషన్ ప్రక్రియ వివరాలు లీక్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...
మామూలు ట్విస్టులు కాదుగా:బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా ప్రేక్షకులు దీనికి భారీ స్పందనను ఇస్తున్నారు. ఫలితంగా ఈ షో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ముఖ్యంగా ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో మొదలు పెట్టారు. దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఇది జనరంజకంగా సాగిపోతోంది.

ఏకంగా ఆరుగురు లేడీస్‌నే:ఉల్టా పుల్టా కాన్సెప్టు కావడంతో భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఆరంభంలో 14 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురులు, ఆరో వారంలో నయని పావనిలు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
నామినేషన్.. పగలగొట్టాలి:వరుసగా ఆరుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడంతో ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్లుగానే ఈ వారం ప్రక్రియను పాత పద్దతిలోనే అంటే కుండలు పగలగొట్టేలా డిజైన్ చేశారు. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి బొమ్మలతో ఉన్న కుండను పగలగొట్టి సరైన కారణాలు చెప్పాలి.
యమా గొడవలతో సాగేలా:మామూలుగానే బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్ల మధ్యన గొడవలు బీభత్సంగా జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా భోలే షావలి - శోభా శెట్టి మధ్య పెద్ద గొడవే జరిగిందట. అలాగే మరికొందరు వాదించుకున్నారని టాక్.

8 మంది నామినేషన్‌లో:తాజాగా జరుగుతోన్న ఏడో సీజన్‌లోని ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో టేస్టీ తేజ, ప్రియాంక జైన్, సందీప్, శోభా శెట్టి, పూజా మూర్తి, అశ్విని శ్రీ, గౌతమ్, భోలే షావలిలు ఉన్నారనే టాక్ వచ్చింది.
అతడికి గుద్ది పడేశారు:బుల్లితెర వర్గాల ద్వారా అందుతోన్న మరో సమాచారం ప్రకారం.. ఏడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో పోటుగాళ్ల నుంచి నలుగురిని, ఆటగాళ్ల నుంచి నలుగురిని నామినేట్ చేశారని తెలిసింది. ఇక, ఈ టాస్కులో భోలే షావలినే ఎక్కువగా టార్గెట్ చేశారని తెలిసింది. దీంతో ఈ సీజన్‌లోనే ఎవరికీ రాని విధంగా అత్యధిక ఓట్లతో అతడు నామినేట్ అయ్యాడట.
ఆమె వస్తే ఉల్టా పుల్టానే:ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో కెప్టెన్ ప్రిన్స్ యావర్, శివాజి, ప్రశాంత్, అమర్‌దీప్, అర్జున్ మినహా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక, ఈరోజో, రేపో లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమెకు కూడా గతంలో మాదిరిగా స్పెషల్ పవర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నామినేషన్స్ లిస్టులో మార్పులు కూడా కనిపించవచ్చు.


Click it and Unblock the Notifications











