Bigg Boss Telugu 7: రైతు బిడ్డ కోసం పాట బిడ్డ కన్నీళ్లు.. తానేం తక్కువ కాదంటూ ఏడ్చిన శివాజీ

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి అంతా రాత్రి 9 కాగానే టీవీల ముందు వాలిపోతున్నారు. ప్రతిరోజూ బిగ్ బాస్ షోను ఫాలో అవుతూ.. తమకు నచ్చిన కంటెస్టెంట్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఓట్లు వేసి మరీ గెలిపించడం, నచ్చని వారిని ఇంట్లోంచి పంపించడం వంటివి చేస్తున్నారు. బయట అంతా ఎలా ఉన్నా కానీ.. ఇంట్లోని కంటెస్టెంట్లు మాత్రం చాలా చక్కగా గేమ్ ఆడుతున్నారు. వాళ్లు కూడా తమకు నచ్చిన వాళ్లకు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 2.0 ప్రారంభానికి ముందు పవర్ అస్త్రా గురించి పోటీ జరగ్గా... ఈ వారం మాత్రం కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఎంతో కష్టపడి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కాప్టెన్సీ దక్కించుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కాప్టెన్ గా మారి.. తాను ఆట ఎంత బాగా ఆడుతున్నాడో అందరికీ చూపించాడు. అయితే కెప్టెన్సీ వచ్చిన కొన్ని రోజుల్లోనే బిగ్ బాస్.. ప్రశాంత్ చేసిన తప్పులను గుర్తు చేసి తన దగ్గర నుంచి కెప్టెన్ బ్యాడ్జీని తీసేసుకున్నాడు. దీంతో ఇంటి మొదటి కాప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్ చాలా బాధ పడిపోయాడు. ఆయనతో పాటు ఎప్పుడూ తన వెంటే ఉండే శివాజీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టిన పాట బిడ్డ భోలె షావళి కూడా కంటతడి పెట్టాడు.

 Shivaji And Bhole Shavali Getting Emotional For Pallavi Prashant Lost His Captaincy

ప్రశాంత్ కాప్టెన్సీ పోయిన తర్వాత పల్లవి ప్రశాంత్, భోలె షావళి ఓ చోట కూర్చొని ఉంటారు. ఈక్రమంలోనే అక్కడకు వచ్చిన శివాజీ.. పల్లవి ప్రశాంత్ కాప్టెన్సీ కోసం చాలా కష్టపడ్డాడు అని శివాజీ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతాడు. అక్కడే ఉన్న ప్రశాంత్.. నాకు అన్న బాగా సపోర్ట్ చేశాడు, నేను గెలవడానికి నాకు ఎంతో సాయం చేశాడంటూ భోలె షావళితో చెప్పుకుంటూ ఏడుస్తాడు. అక్కడే ఉన్న బోలె కూడా పల్లవి ప్రశాంత్ తో రాగం కలుపుతాడు. అతను కూడా ఏడుస్తాడు. శివాజీ కూడా ఏడుస్తూనే... పల్లవి ప్రశాంత్ కు మరోసారి హితబోధ చేస్తాడు.

ఎది అతి అయినా కూడా వికటిస్తుందని.. మళ్లీ ఆడు గెలువు. నవ్వు కెప్టెన్ అయ్యి చూపించు.. అంటూ పల్లవి ప్రశాంత్ ను ఓదార్చి అక్కడ నుంచి శివాజీ వెళ్లిపోతాడు. ఆ తర్వాత రూంలోకి వెళ్లి ఇతర కంటెస్టెంట్లతో కూడా ప్రశాంత్ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతాడు. వాడు కాప్టెన్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాడు అని.. వాడిని చూస్తే నాకే ఏడుపు వస్తుందని అంటాడు. ఆ తర్వాత వాడు వేషం వేయడం ఎందుకు దొంగోడిలాగానే ఉన్నాడు కదా అని ఒకడు అన్నాడు అంటూ అమర్ దీప్ చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇలా మరింత బాధపడుతూ కంటతడి పెట్టాడు శివాజీ.

కానీ తాజాగా వచ్చిన ప్రోమో చూస్తే మాత్రం.. బిగ్ బాస్ మళ్లీ పల్లవి ప్రశాంత్ కు కాప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కాప్టెన్సీ బాధ్యతలు పల్లవి ప్రశాంత్ కు గుర్తు చేసేందుకు బిగ్ బాస్ ఇలా చేశారని సమాచారం. మరి బిగ్ బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్ తో తెగ సంబరపడిపోతున్న పల్లవి ప్రశాంత్.. ఈసారి అయినా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తాడో లేదో చూడాలి. కాప్టెన్సీ పోగానే రైతు బిడ్డకోసం కన్నీళ్లు కార్చిన పాట బిడ్డ భోలె షావళి, శివాజీలు.. కాప్టెన్సీ తిరిగి రావడంతో తెగ ఖుషీ అయిపోతున్నారు. వీరి ఆనందాన్ని మీ కళ్లారా చూడాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

 Shivaji And Bhole Shavali Getting Emotional For Pallavi Prashant Lost His Captaincy

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X