Bigg Boss Telugu 7 హౌస్‌లో కొత్త పంచాయతీ.. బిగ్‌బాస్‌కే టేస్టీ తేజ వార్నింగ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకూ మరింత ఆసక్తిని కల్గజేస్తోంది. షో ప్రారంభమైన మొదటి రోజుల్లో కంటే కూడా చివరలో చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంకో నాలుగైదు వారాలు మాత్రమే ఉందన్నప్పుడు కంటెస్టెంట్లు ఆడే తీరు అద్భుతంగా ఉంటుంది. అలాగే బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఇప్పటికే షో ప్రారంభం అయి 8 వారాలు పూర్తి అయింది. తాజాగా 9వ వారంలోకి అడుగు పెట్టారు కంటెస్టెంట్లు అందరూ. నిన్న సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవడంతో ఇంట్లో ప్రస్తుతం.. 11 మంది ఉన్నారు.

ఈక్రమంలోనే 9వ వారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు బిగ్ బాస్. అందులో ఒక్కొక్కరూ ఒక్కొక్కరినీ నామినేట్ చేస్తూ చెప్పిన కారణాలు, జరిగన రచ్చ ఫుల్ వాడీవేడిగా ఉంది. ఈరోజు విడుదల అయిన ప్రోమో చూస్తుంటే ఈ విషయాలు అర్థం అవుతాయి. ముఖ్యంగా గత వారం చాలా చెత్తగా గేమ్ ఆడి.. అందరిపై నోరు పారేసుకున్న శోభా శెట్టి ఈ వారం కూడా అలాగే చేస్తోంది. నామినేషన్లలో భాగంగా తాను నామినేట్ చేసిన వారితో పాటు తనను నామినేట్ చేసిన వారితో వాగ్వాదానికి దిగింది.

Bigg Boss Telugu 7 Shobha Shetty Fires on Ambati Arjun in Nomminations Task

సీరియల్ బ్యాచ్ కు చెందిన అంబటి అర్జున్.. నాగార్జున మాటను గుర్తు పెట్టుకున్నాడో ఏమో. గ్రూప్ గేమ్ అని చూసేవాళ్లు అనుకోకూడదు అంటూ ఇచ్చిన హింట్ తో.. తాను ఎవరి సైడ్ కాదని నిరూపించుకునేందుకు ఏకంగా తన స్నేహితురాలైన శోభా శెట్టినే నామినేట్ చేశాడు. ఇది ఎవరూ ఊహించకపోయినా.. జరిగింది మాత్రం అదే. మజాక్‌లో ఎన్ని మాటలు అన్నా ఓకే కానీ.. సీరియస్‌గా ఉన్నప్పుడు నోరు జారకూడదని చెబుతూ అంబటి అర్జున్... శోభాను నామినేట్ చేశాడు. దీనికి శోభా చాలా ఫీలైంది. అంతకు మించిన కోపంతో అతడిపై అరిచింది. ఇక మీదట నేనేంటో చూపిస్తానంటూ ఫుల్ అగ్రెసివ్ గా కనిపించింది.

Bigg Boss Telugu 7 Shobha Shetty Fires on Ambati Arjun in Nomminations Task

మరోవైపు టేస్టీ తేజ కూడా ఇలాగే కోపంగా బిహేవ్ చేశాడు. ఏకంగా బిగ్‌బాస్ కే సలహాలు ఇచ్చాడు. బిగ్ బాస్ నెక్ట్స్ నుంచి మీరు గెలిచిన వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వండి, డిసర్వ్, అన్ డిసర్వ్ అని టాస్కులు పెట్టి మాకు ఈ పంచాయతీలు పెట్టకండి అంటూ ఫైర్ అయ్యాడు. ఇది విన్న అందరూ అలాగే చూస్తుండిపోయారు. అయితే పల్లవి ప్రశాంత్.. టేస్టీ తేజను నామినేట్ చేసినప్పుడు అతను ఇచ్చి రీజన్స్ వల్లే తేజ ఇలా ఫైర్ అయినట్లు ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. రైతుబిడ్డ టేస్టీ తేజతోపాటు అమర్ దీప్ ను నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది.

ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్.. భోలేను నామినేట్ చేస్తూ.. నాకు మిరపకాయల దండ ఎందుకు వేశారని అడుగుతుంది. నీకు నేను ఓటు వేయలేదు పోటు వేశాను.. నాను నువ్వు వర్త్ అనిపించలేదంటూ భోలె కామెంట్లు చేశాడు. ఇందులో భాగంగానే వీరిద్దరి మధ్య కూడా గట్టిగానే వార్ జరిగనట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ రోజుటి ఎపిసోడ్ చూస్తే తప్ప ఎవరూ ఎంతలా ఫైర్ అయ్యారో తెలిసేలా లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X