Bigg Boss Telugu 7: శోభా శెట్టి స్కెచ్ మామూలుగా లేదుగా, ఆయన ఎలిమినేట్ అయితే అది తనకేనట!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్ లో చోటు చేసుకునే విషయాలు గొడవలు అయితే.. ఇప్పటికీ ఏ సీజన్ లోనూ చోటు చేసుకోని రీతిలో సాగుతున్నాయి. ముఖ్యంగా శోభా శెట్టి అయితే అచ్చం కార్తీక దీపం సీరియల్ లో మోనితలాగే ప్రవర్తిస్తుంది. అందరిపైకి నోరేసుకొని పడిపోతుంది. ఆమె ఆడుతున్న తీరు చూస్తుంటే ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. ఈ వారం ఆమె ఎలిమినేట్ అయితే బాగుండని కోరుకుంటున్నారు. ఆమె చేసే రచ్చ, ఓవర్ యాక్షన్ ను అస్సలే చూడలేకపోతున్నారు.

ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ అప్పటి నుంచి శోభా శెట్టి ఫుల్ ఫైర్ మీద ఉంది. నామినేట్ చేసిన వారి మీద పడిపోతూ తెగ అరిచేసింది. భోలె షావళిపై అయితే విరుచుకు పడుతుంది. అపరిచితురాలు లాగా ప్రవర్తిస్తూ అందరినీ హడల గొడుతుంది. తాను నామినేట్ చేస్తూ కూడా అలాగే రచ్చ చేసింది. ఇదంతా ఒకెత్తు అయితే ఆ తర్వాత ఆమె గేమ్ లలో ఆడే తీరు కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా ప్రియాంక జైన్, అమర్ దీప్, టేస్టీ తేజలకు చాలా ఫేవర్ గా ఉంటూ మిగిలిన వాళ్లను ఓ ఆట ఆడేసుకుంటుంది.

Bigg Boss Telugu 7 Shobha Shetty Shocking Comments on Sivaji

ఫ్లోట్, సింక్ గేమ్ లో కూడా మొత్తం ఫౌల్ గేమ్ ఆడారు. అమర్ దీప్ కు ఆన్సర్ లు చెబుతూ అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత ఇతర గేమ్ లలోనూ ఇలాగే గొడవ చేసింది. కెప్టెన్సీ టాస్కు కోసం చివరగా జరిగిన మిరపకాయ దండలు వేసే టాస్కులో అయితే తన విశ్వ రూపం చూపించేసింది. ప్రిన్స్ యావర్ ను పిచ్చోడా, పిచ్చోడా అంటూ వెర్రెత్తినట్లు అరిచింది. ఎంత మంది ఆపే ప్రయత్నం చేసినా ఇద్దరూ అలాగే అరుచుకున్నారు. ఆమె బిహేవియర్ కు తీవ్ర కోపోద్రిక్తుడు అయిన యావర్ కూడా అదే స్థాయిలో విరుచుకు పడ్డాడు.

చివరకు కెప్టెన్సీ టాస్కులో గెలవలేక, కెప్టెన్ కాలేకపోయినందుకు కూడా ఫుల్లుగా ఏడుస్తూ.. తెగ రచ్చ చేసింది. అయితే తాజాగా టేస్టీ తేజతో ఆమె చేసిన కొన్ని కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. ఎందుకంటే.. శోభా శెట్టి శివాజీ ఎలిమినేట్ అయితే ఆయన తాగే కాఫీ మనకే వస్తుందని చెప్పింది. ఇది చూసిన శివాజి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. నీ కాఫీ కోసం ఆయన ఎలిమినేట్ కావాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫుల్లుగా ఫైర్ అవుతూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 7 Shobha Shetty Shocking Comments on Sivaji

ఇదిలా ఉండగా.. కెప్టెన్సీ టాస్కు అనంతరం శోభా శెట్టి అశ్వినీతో కూర్చుంది. అక్కడ కూడా రతికా తినడం, తిరగడం తప్ప ఇంకేమీ చేయదంటూ కామెంట్లు చేసింది. అందుకు అశ్వినీ స్పందిస్తూ.. అవును రతికా ఏంటి అంతలా తింటుంది అంటూ కామెంట్లు చేసింది. ఆమెది దెయ్యం తిండి అంటూ వివరించింది. ఈ విషయంలో కూడా వీరిద్దరిపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై నాగార్జున ఏమైనా స్పందిస్తారా, శోభా శెట్టి చేసిన ఓవర్ యాక్షన్ కు ఏ స్థాయిలో ఫైర్ అవుతారో తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ కచ్చితంగా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X