Bigg Boss Telugu 7: 13వ వారం కెప్టెన్ ఎవరంటే? మొదటిసారి ఆ కంటెస్టెంట్‌కే ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి మంచి ఆదరణ వస్తుంది. ఇక 11 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో.. మరో రెండు రోజుల్లో 12వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇక 13వ వారం కెప్టెన్సీ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. దానికి సంబంధించిన టాస్కులను బిగ్ బాస్ నిర్వహిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు 13వ వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఇదివరకే కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించిన ఆ కంటెస్టెంట్ కెప్టెన్ గా అయ్యారు. ఎవరు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక ఆరోజు నుంచి గత సీజన్స్ కంటే ఈ సీజన్ ఆసక్తిగా సాగుతోంది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత షోపై మరింత హైప్ నెలకొంది. ప్రస్తుతానికి షోలో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక వీరిలో ఫినాలేకి ఎవరు వెళ్లనున్నారు.. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. తుది అంకానికి చేరుకుంటుంది.

మరో నాలుగు వారాల్లో ఈ షోకి ఎండ్ కార్డు పడనుంది. డిసెంబర్ 17న రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాంఢ్ పినాలే జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ 7 కాబట్టి.. టాప్ 7 కంటెస్టెంట్స్ ను ఫినాలేకి పంపించనున్నారట నిర్వహకులు. ఇక ఈ టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరు అనేది జనాల్లో ఆసక్తిగా మారిపోయింది. ప్రస్తుతం హౌస్ లో పది మంది మాత్రమే ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ జరగలేదు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఇంట్రెస్ట్ గా మారింది.

ఇదిలా ఉంటే.. 13వ వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. 13వ వారానికి సంబంధించిన టాస్కులను బిగ్ బాస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. హౌస్ లోని 10 మంది అంటే శివాజీ, యావర్, అర్జున్, గౌతమ్, ప్రశాంత్, అమర్ దీప్, రతికా రోజ్, అశ్విని, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లకు ఓ స్కిట్ లాంటిది ఇచ్చాడు. ఇక శివాజీ మేనేజర్.. ఆయనకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో శివాజీ ఫెయిల్ అయిన సంగితి తెలిసిందే.

ఇక ప్రియాంక జైన్ కు ఆ సీక్రెట్ టాస్క్ ఇవ్వగా ఆమె సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. దీంతో ప్రియాంక జైన్ కెప్టెన్ అంటూ ప్రచారం జరిగింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... బిగ్ బాస్ 13వ వారానికి కెప్టెన్ గా అమర్ దీప్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమర్ దీప్ కు ఆ అవకాశం రాలేదు. దీంతో ఆయనకు ఈ వారం అవకాశం వచ్చినట్లు బిగ్ బాస్ నిర్వహాకుల నుంచి లీక్స్ వచ్చాయి. ఇక అమర్ దీప్ కల ఈ వారం నిజం కాబోతుంది.

ఇక అమర్ దీప్ కెప్టెన్ కావడంతో.. ఆయన టాప్ 7లో నిలుస్తారని తెలుస్తోంది. ఈ సీజన్ 7 కాబట్టి.. ఫినాలికి టాప్ 7 కంటెస్టెంట్స్ ను పంపించనున్నారు. ఇక ఈ సీజన్ విన్నర్ మొదటి నుంచి శివాజీ, ప్రశాంత్ అనుకున్నారు. ఇక అమర్ దీప్ కు గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఆయనే ఈ సీజన్ విన్నర్ అంటున్నారు. అంతే కాదు ఈ వారం అశ్విని శ్రీ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











