Bigg Boss Nominations: 8వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్.. టైటిల్ ఫేవరెట్లకు షాక్.. అతడు నయా రికార్డు

కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి మద్దతును కూడగట్టుకుని సూపర్ డూపర్ హిట్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు తీసుకు రావడంతో పాటు కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీ, ఎమోషన్స్ ఇలా రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ నిర్వహకులు షోను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జరుగుతోన్న ఏడో సీజన్ మరింత రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎనిమిదో వారం నామినేషన్స్ లిస్ట్ లీకైంది. అది మీరే చూడండి!

ట్విస్టులతోనే సాగుతోందిగా:మిగిలిన సీజన్ల కంటే ఏడో దాన్ని బిగ్ బాస్ నిర్వహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఈ సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తున్న దీనికి ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన లభిస్తోంది. దీంతో మరింత ఉత్సాహంగా ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఫలితంగా ఇది రంజుగా సాగిపోతోంది.

Bigg Boss Telugu 7 Show 8th Week Nominations List Was Leaked

ఏడుగురూ వాళ్లే వెళ్లారుగా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఆరంభంలో 14 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురులు వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో ఐదుగురు వచ్చారు. ఈ క్రమంలోనే ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యారు.

నామినేషన్స్ కాల్చేయాలి:ఇండియాలోనే ఏ భాషలోనూ జరగని విధంగా తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పటి వరకూ లేడీ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఇప్పుడు 8వ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఇక, దీన్ని మంటల్లో కాల్చే టాస్కుతో నిర్వహించబోతున్నారు. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి ఫొటోలను కాల్చి.. అందుకు తగ్గట్లుగా కారణాలను చెప్పాల్సి ఉంటుంది.

Bigg Boss Telugu 7 Show 8th Week Nominations List Was Leaked

గొడవలతో సాగిన టాస్కు:బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కే అతి ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ టాస్కు జరుగుతున్న సమయంలో గొడవలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎనిమిదో వారం నామినేషన్స్‌లో శివాజి - శోభా శెట్టి, ప్రశాంత్ - గౌతమ్ కృష్ణ, భోలే షావలి - ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు తెలిసింది. మిగిలిన వాళ్లు కూడా వాగ్వాదానికి దిగారని తెలిసింది.

నామినేషన్‌లో ఏడుగురు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని ఎనిమిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో శివాజి, ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, భోలే షావలిలు ఉన్నారని సమాచారం.

సందీప్ మాస్టర్ రికార్డు:బుల్లితెర వర్గాల ద్వారా అందుతోన్న మరో సమాచారం ప్రకారం.. ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో సందీప్ మాస్టర్‌ నామినేట్ అవలేదని తెలిసింది. ఫలితంగా అతడు ఈ సీజన్‌లో ఒక్క వారం కూడా నామినేషన్స్‌లోకి రాలేదు. దీంతో ఎక్కువ వారాలు నామినేట్ అవని ఏకైక కంటెస్టెంట్‌గా సందీప్ రికార్డు సృష్టించినట్లు బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Bigg Boss Telugu 7 Show 8th Week Nominations List Was Leaked

రతికాకు స్పెషల్ పవర్:ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో కెప్టెన్ అర్జున్, శోభా శెట్టి, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, సందీప్ మినహా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లతో పాటు రీఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కూడా ఉంది. ఆమెకు కూడా గతంలో మాదిరిగా స్పెషల్ పవర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నామినేషన్స్ లిస్టులో మార్పులు కూడా కనిపించవచ్చని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X