Bigg Boss Telugu 7: శివాజీకి బంపర్ ఆఫర్...సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. అలా చేస్తే డైరెక్ట్‌గా విన్నర్?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. ఇక నామినేషన్స్ ఆరు మంది టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం సేఫ్ అయిన వారిలో శివాజీ, యావర్, శోభా శెట్టి, ప్రియాంక ఉన్నారు. ఇక హౌస్ లో టాస్కులు నడుస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే శివాజికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. శివాజీకి టాస్కులో భాగంగా ఓ సీక్రెట్ టాస్కు ఇచ్చాడు. ఇందులో కనుక శివాజి విన్ అయితే.. బిగ్ బాస్ ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. గత 11 వారాలుగా అలరిస్తూ ఉంది. ఇక 12వ వారంలోనూ అదే జోష్ తో కంటెస్టెంట్స్ ఆడుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించాడు. మరోవైపు 12వ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. అందులో అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ, రతిక, అర్జున్, ప్రశాంత్, అశ్విని నామినేట్ అయ్యారు. ఇక అశ్విని ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ నామినేట్ అయింది.

Bigg Boss Telugu 7 Show: Bigg Boss Given Secret Task to Sivaji Full Details Here

ఇక ఈ వారం రతికా రోజ్, అశ్విని శ్రీ ఔట్ పక్కా అని అంటున్నారు. ఇక ప్రస్తుతానికి హౌస్ లో ఎవిక్షన్ పాస్ కోసం పోటీలు నిర్వహించారు. ఇక ఈ పోటీల్లో పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ గెలిచాడు. కానీ ఆ పాస్ ను తను కాపాడుకోవాలి అని బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే హౌస్ లోని వారితో పోటీ పడి.. దాన్ని గెలుచుకోవాలి అని అంటున్నారు. ఇక హౌస్ లో మరో టాస్క్ కూడా జరగుతుందట.

నెక్ట్స్ వీక్ కెప్టెన్ ఎవరో తెల్చాలి అంటే.. ఈ వారం టాస్కులు పెడుతాడు బిగ్ బాస్. అలా అందరికీ ఓ స్కిట్ లాంటి టాస్క్ ఇచ్చాడట బిగ్ బాస్. అందులో శివాజీకి మేనెజర్, ప్రశాంత్ చెఫ్, గౌతమ్ పనోడు, రతికా డ్రైవర్ వంటి క్యారెక్టర్స్ ను ఇచ్చాడు. అయితే అందులో శివాజీకి మాత్రం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడట.

అదేంటంటే.. శివాజీ.. ఇంట్లోని వాళ్లను డెడ్ చేయాలి.. ఎవరికి అనుమానం రాకుండా తను ఆ పాత్రను పోషించాలి. సీక్రెట్ టాస్కును కంప్లీట్ చేస్తే... బిగ్ బాస్ శివాజీని డైరెక్టుగా కంటెండర్ గా ఎన్నుకుంటాడు. ఈ సీజన్ లో శివాజీ మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడుతూ వస్తున్నాడు. కొద్ది రోజులు చేయి నొప్పితో టాస్కులకు దూరంగా ఉన్న శివాజీ ఇటీవల కాలంలోనే టాస్కుల్లోనూ ఆడి తనేంటో నిరూపించుకుంటున్నాడు.

శివాజీ ఈ టాస్కులో గెలిస్తే.. నెక్ట్స్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ గా ఎన్నిక అవుతారు. ఈ వీక్ కెప్టెన్ గా ప్రియాంక అయింది. ఇక క్యాప్టెన్ కానీ వాళ్లు ఎవరు ఉన్నారంటే.. అమర్ దీప్, అశ్విని రతికా రోజ్ కావాల్సి ఉంది. ఇక రతికా, అశ్వినికి ఆ ఛాన్స్ దక్కకపోవచ్చు కానీ.. అమర్ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X