Bigg Boss 7: ఏడో సీజన్ లో పాపులర్ సింగర్.. ఆమెతోపాటు కొత్తగా పెళ్లయిన సెలబ్రిటీ జంట!

అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో మంచి సక్సెస్ సాధించింది. దీంతో వరుస పెట్టి సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవలే డిసెంబర్ 18న ఆరో సీజన్ కూడా గ్రాండ్ ఫినాలేను నిర్వహించి పూర్తి చేశారు. అయితే మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఈ ఆరో సీజన్ అంతగా క్లిక్ కాలేదు. దీంతో తర్వాత వచ్చే అంటే ఏడో సీజన్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది బిగ్ బాస్ మేనేజ్ మెంట్. ఇక ఇందులో పాల్గొనేందుకు ఒక పాపులర్ లేడీ సింగర్ తోపాటు ఇటీవల పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటను కంటెస్టెంట్లుగా తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

హోస్టింగ్ నుంచి తప్పుకున్న నాగ్..

హోస్టింగ్ నుంచి తప్పుకున్న నాగ్..

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ గ్రాండ్ ఫినాలే ఈ డిసెంబర్ 18న జరిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా సింగర్ రేవంత్ నిలవగా రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక ఈ సీజన్ తర్వాత బిగ్ బాస్ షో హోస్టింగ్ నాగార్జున గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. పలు కారణాల దృష్ట్యా హోస్టింగ్ నుంచి నాగార్జన తప్పుకుంటున్నట్లు టాక్.

సర్జరీ కారణంగా..

సర్జరీ కారణంగా..


హోస్ట్ గా నాగార్జున తప్పుకోవడంతో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని టాక్ వినిపిస్తోంది. రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం. అయితే రానాకు ఒక సర్జరీ కారణంగా సినిమాలకు కొన్ని నెలలు దూరం కానున్నాడట. ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చన్న ఉద్దేశంతో రానా దగ్గుపాటి దాదాపుగా ఒప్పుకున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

పాపులర్ సింగర్ కోసం..

పాపులర్ సింగర్ కోసం..

ఇక ఇదిలా ఉంటే ఏడో సీజన్ కోసం తీసుకునే కంటెస్టెంట్ల కోసం ఎప్పటినుంచో వెతకడం మొదలుపెట్టింది బీబీ టీమ్. ఇందులో భాగంగానే ఏడో సీజన్ కంటెస్టెంట్ లో ఒకరిగా ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ మోహన భోగరాజును తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం మోహన భోగరాజును బీబీ 7 టీమ్ అప్రోచ్ అయిందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.

సింగర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా..

సింగర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా..

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తాపా.. అనే ఫోక్ సాంగ్ ద్వారా విపరీతంగా పాపులర్ అయింది సింగర్ మోహన భోగరాజు. పాట పాడటమే కాకుండా ఈ వీడియో సాంగ్ లో కూడా నర్తించింది ఈ బ్యూటిఫుల్ సింగర్. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా కంటెస్టెంట్ గా ఆమెను తీసుకుంటే మంచిదని బీబీ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ లో ఎవరో ఒకరు సింగర్ కచ్చితంగా ఉంటూనే వస్తున్నారు.

అతను తప్పా మిగతావారు విన్నర్స్ గా..

అతను తప్పా మిగతావారు విన్నర్స్ గా..

బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్, ఐదో సీజన్ లో శ్రీరామ చంద్ర, ఆరో సీజన్ లో రేవంత్ ఇలా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. శ్రీరామ చంద్ర తప్పా మిగతా సింగర్స్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ ఆరో సీజన్ లో మెరీనా అబ్రహం-రోహిత్ సహ్ని, మూడో సీజన్ లో వరుణ్ సందేశ్-వితికా షేరు కపుల్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కోసం కూడా మరో సెలబ్రిటీ జంటను అప్రోచ్ అయిందట బీబీ మేనేజ్ మెంట్.

సీరియల్ యాక్టర్స్..

సీరియల్ యాక్టర్స్..


ఆ జంట ఎవరో కాదు ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్ అండ్ తేజస్విని గౌడ. జానకి కలగనలేదు సీరియల్ లో, మిస్టర్ పెళ్లాం వెబ్ సిరీస్ లో హీరోగా నటించిన అమర్ దీప్ చౌదరి, కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటించిన తేజస్విని గౌడ్ ఆగస్టులో ఎంగేజ్ మెంట్ చేసుకుని డిసెంబర్ 14న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. బీబీ7 కోసం వీళ్లిద్దరిని బీబీ టీమ్ సంప్రదించినట్లు మరో టాక్ వినిపిస్తోంది.

జూలైలో ప్రారంభించాలని..

జూలైలో ప్రారంభించాలని..


బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ అవడంతో ఏడో దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే దీన్ని వచ్చే ఏడాది జూలైలోనే మొదలు పెట్టాలని నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారని తాజాగా న్యూస్ లీకైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X