Bigg Boss Telugu 7: అమర్ దీప్ చేసిన పనికి శివాజి కంటతడి..!

Bigg Boss Telugu 7: తెలుగు బుల్లితెర చరిత్రలో ఊహించని రీతిలో టీఆర్పీని సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు. నెంబర్ వన్ రియాల్టీ షోగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ షో నిజంగా చాలా అద్భుతంగా సాగుతోంది. అదిరిపోయే టాస్కులు, అంతకు మించిన ఎమోషన్లతో షో చాలా రసవత్తరంగా నడుస్తోంది. అయితే తాజాగా వచ్చిన ప్రోమోలో శివాజి కంటతడి పెట్టాడు. అమర్ దీప్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇప్పుడిప్పుడే అమర్ దీప్ మారాడు అనుకుంటుండగా.. శివాజీపై మరోసారి అటాక్ చేశాడు. శివాజీ కాప్టెన్ కాకుండా చేసి తన పగ తీర్చుకున్నాడు.

అయితే ఈ వారం గ్రహాంతర వాసులను సంతృప్తి పరిచే టాస్కు పూర్తి కాగా... ఎవర్ని కంటెండర్ షిప్ నుంచి తొలగించాలనుకుంటున్నారో కారణాలు చెబుతూ, వారి ఫొటోలను స్విమ్మింగ్ పూల్ లో వేయాల్సిందిగా బిబ్ బాస్ కంటెస్టెంట్లకు తెలిపారు. ఇందులో అందరూ తమకు నచ్చని వారి ఫొటోలను స్విమ్మింగ్ పూల్ లో వేశారు. ఈక్రమంలోనే అమర్ దీప్ వంతు రాగా.. ఎప్పటిలాగే తనకు నచ్చని శివాజి ఫొటోను పూల్ లో వేశాడు. అయితే తాను ఎందుకు హౌజ్ లోకి ఉండేందుకు క్యాపబుల్ కాదో సరైన వివరణ ఇవ్వాలని శివాజి అన్నాడు.

Bigg Boss Telugu 7 Sivaji Crying For Lost His Contendorship Due to Amardeep Nommination

ఇంట్లోంచి పంపించేయమంటూ శివాజి కంటతడి
ఇందుకు అమర్ దీప్.. మీరు ఎక్కువగా ఆడలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటూ చెప్పాడు. లేదు సరైన వివరణ ఇవ్వమంటూ మరోసారి అడగ్గా... మీ కంటే బాగా గేమ్ ఆడిన వాళ్లు చాలా మంది ఉన్నారు.. వారికి ఛాన్స్ రావడం కోసమే మీ ఫొటో పూల్ లో వేస్తున్నానంటూ ఫొటోను అందులే వేసేశాడు. ఇందుకు శివాజి చాలా ఫీల్ అయ్యాడు. ఓవైపు చేయి నొప్పి పెట్టుకొని కూడా చాలా కష్టపడి ఆడానని.. తనకు ఇంట్లో ఉండే అర్హత లేదని భావిస్తున్నారు కాబట్టి వెళ్లిపోతానంటూ కంటతడి పెట్టాడు.

Bigg Boss Telugu 7 Sivaji Crying For Lost His Contendorship Due to Amardeep Nommination

అమర్ దీప్ అన్న మాటలకు నలిగిపోతున్నా..
శివాజి బాధను గమనించిన బిగ్ బాస్ కన్ ఫెషన్ రూంలోకి పిలిచాడు. ఏమైంది శివాజి, ఎందుకు బాధపడుతున్నావని బిగ్ బాస్ అడగ్గా... ఈ చేయి అంతా చాలా నొప్పిగా ఉంది బిగ్ బాస్, తట్టుకోలేక పోతున్నానని శివాజి చెప్పాడు. చేయంతా ఒకటే లాగుతుందని వివరించాడు. అలాగే తాను కాప్టెన్ అయ్యేందుకు అర్హత లేదని, తాను గేమ్ ఆడలేదని అమర్ దీప్ చెప్పిన కారణం చాలా బాధ కల్గిస్తుందన్నాడు. ఈ రీజన్ ను తాను తీసుకోలేకపోతున్నానని.. ఒక్కడినే రూంలో కూర్చొని ఏడుస్తున్నానని, వారి ముందు ఏడ్వలేక లోలోపలే కుమిలి పోతున్నానని చెప్పాడు.

Bigg Boss Telugu 7 Sivaji Crying For Lost His Contendorship Due to Amardeep Nommination

శివాజి కంటెండర్ కాలేకపోయినందుకు నిజంగానే చాలా ఫీల్ అవుతున్నాడు. ముఖ్యంగా అమర్ దీప్ ఇచ్చిన రీజన్ కు శివాజీ చాలా హర్ట్ అయ్యాడు. చేతి నొప్పి పెట్టుకొని కూడా గేమ్ ఆడితే.. అర్హతన లేదని చెప్పడాన్ని అతడు తీసుకోలేకపోతున్నాడు. మరి ఇంతలా ఏడుస్తున్న శివాజికి ధైర్యం చెప్పి ఇంట్లోనే ఉంచుతాడా, లేదా బయటకు వెళ్తానంటున్న అతడిని బిగ్ బాస్ బయటకు పంపిస్తాడా తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X