Bigg Boss Telugu 7: శివాజి మైండ్ గేమ్‌కు మరొకరు బలి.. మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకుంటూ రచ్చ చేస్తోంది. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అంతా టీవీల ముందు వాలిపోయేలా చేస్తుంది. అయితే పదో వారంలో భాగంగా పాటబిడ్డ భోలె షవాళి ఎలిమినేట్ అయ్యారు. ఇక పదకొండో వారం ఈరోజుతో ప్రారంభం కాగా.. నామినేషన్ల పర్వం అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో ఒకరిని మించి మరొకరు అగ్రెసివ్ అవుతున్నారు.
ఈరోజు బిగ్ బాస్ టీం విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే ఈ విషయం అర్థం అయిపోతుంది. మొదటి వారం నుంచి అద్భుతమైన ఆట ఆడుతూ... అందరికీ పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నారు శివాజి. ముఖ్యంగా రైతుబిడ్డకు సపోర్ట్ గా నిలిచి అందరి మనుసుల్లో స్థానం సంపాధించుకున్నాడు. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ల వల్లే ఆయనకు విపరీతమైన హైప్ పెరిగింది. అయితే రోజురోజుకూ తన మైండ్ గేమ్ ను మార్చుకుంటే విన్నర్ గా నిలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజా తన గేమ్ స్ట్రాటజీని మార్చారు.

ఓసారి ఎలిమినేట్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్.. శివన్న శివన్నా అంటూ ఆయన వెనకాలే తిరుగుతుంది. నేరుగా ఆమే యావర్ తో చెబుతూ మీతోనే ఉంటూ గేమ్ ఆడుతానని కూడా చెప్పింది. ఇలా తన స్ట్రాటెజీ ఏంటో అందరికీ తెలిసిపోయేలా చేసింది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీకి శివాజి మరోసారి హితబోధ చేశాడు. తనకు తెలిసిన విషయాలు చెబుతూ తన గేమ్ స్ట్రాటెజీ మార్చినట్లు ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా నామినేషన్లలో నీ పాయింట్ కరెక్టుగా చెప్పంటూ వివరించాడు.
పాయింట్ చెప్పకుండా ఏదేదో చెబితే బాగోదని.. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో దాన్నే స్ట్రెయిట్ గా స్ట్రాంగ్ గా చెప్పు అని రతికా రోజ్ కు వివరించాడు. శివాజి చెప్పిన మాటలు మనసులో పెట్టుకున్న రతికా రోజ్ ఫుల్ ఫైర్ అయింది. ఇన్ని రోజుల్లో ఆమె ఏరోజూ కానంత అగ్రెసివ్ అయి అందరికీ షాకిచ్చింది. ముఖ్యంగా ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పిన శివాజి కూడా ఆమె కోపానికి షాకయ్యాడు. ఈ ప్రోమో చూస్తుంటే రతికా రోజ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు అనోకక మానరు. ముఖ్యంగా రతికా రోజ్ శోభా శెట్టి, ప్రియాంకలపై నోరు పారేసుకుంది.
గట్టిగా గట్టిగా అరుస్తూ.. మీరు ఈ వారంలో ఏం చేశారో చెప్పాలంటూ రచ్చ చేసింది. నేను నా 200 పర్సంట్ ఇచ్చానంటూ శోభా శెట్టి చెప్పగా.. నంబర్స్ చెప్పడం కాదు దమ్ముంటే నువ్వేం చేశావో పాయింట్స్ చెప్పంటూ ఫైర్ అయింది. అది చూసిన శోభా కూడా ఏం మాట్లాడలేక నోరు మూసుకుంది. అలాగే ప్రియాంకా.. ఆన్సర్ టు మై పాయింట్ అంటూ గట్టిగా అరిచింది రతికా రోజ్. ఇది చూసిన కంటెస్టెంట్లు అంతా తెగ షాకయ్యారు. శివాజి చెప్పిన మాటల వల్లే రతికా రోజ్ ఇలా వ్యవహరించిందని ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. రతికా ఇంత చేసినా ఆమె కూడా నామినేషన్లలోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











