Survey on Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్‌లో ముఠా రాజకీయం.. ఆ నలుగురిపై నెటిజన్ల ఫైర్!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక వీకెండ్ వచ్చేసింది. షో కూడా రసవత్తరంగా సాగుతోంది. మరోసారి హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో 10 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఐదో వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7లో 4వ వారం రతిక ఎలిమినేషన్ కరక్టేనా? అని అడిగితే... నెటిజన్లు అవును అని 60 శాతం ఓటు వేయగా.. కాదు అని 36 శాతం ఓటు వేశారు. ఇక చెప్పలేం అంటూ 3 శాతం మంది ఓటు వేశారు. ఇక రతిక ఎలిమినేషన్ పై నెటిజన్స్ అవును అనే దానికి ఎక్కువ ఓటు వేశారు. దీనితో ఆమె ఎలిమినేట్ అవ్వడం నెటిజన్స్ కు కరెక్ట్ అనిపించింది.

బిగ్‌బాస్ తెలుగు7 షోలో శివాజీ నుంచి పవర్ అస్త్ర వెనక్కి తీసుకొని హౌస్‌మేట్ నుంచి కంటెస్టెంట్ చేయడం కరక్టేనా? అని అడిగిన ప్రశ్నకు అవును అని 42 శాతం మంది ఓటు వేయగా.. కాదు అని 49 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేం అంటూ 8 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. శివాజీ పవర్ అస్త్ర వెనక్కి తీసుకోవడం నెటిజన్స్ కు నచ్చలేదని తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు 7లో 5 వారం నామినేట్ అయిన ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకొంటున్నారు? అని అనగా... యాక్టర్ శివాజీ 18 శాతం, ప్రిన్స్ యావర్ 4 శాతం, అమర్ దీప్ 16 శాతం, డాక్టర్ గౌతమ్ కృష్ణ 3 శాతం, ప్రియాంక జైన్ 10 శాతం, శుభ శ్రీ 16 శాతం, టేస్టీ తేజ 30 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ సర్వే ప్రకారం టేస్టీ తేజ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఆట సందీప్, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్ గ్రూపిజంతో ఆడుతున్నారా? అనే ప్రశ్న అడగ్గా.. అవును అని 66 శాతం మంది, కాదు అని 21 శాతం మంది, చెప్పలేం అని 12 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. వాళ్లు గ్రూపిజంతోనే ఆడుతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ ఎలా సాగుతుందని మీరు అనుకొంటున్నారు? అని అడగ్గా... బాగుంది 45 శాతం మంది, బాగాలేదు 46 శాతం, చెప్పలేం 6 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ సీజన్ సగం మందికి నచ్చగా.. సగం మందికి నచ్చలేదని తెలుస్తోంది.

బిగ్ బాస్ షోను అక్కినేని నాగార్జున ఎలా హోస్ట్ చేస్తున్నాడు? అని అడగ్గా... మంచిగా చేస్తున్నాడు అని 46శాతం మంది ఓటు వేయగా... ఫర్వాలేదు అని 29 శాతం మంది ఓటు వేశారు. ఇక బాగా చేయడం లేదు అని 22 శాతం మంది ఓటు వేయగా... చెప్పలేం 1శాతం మంది ఓటు వేశారు. ఇక దీన్నిబట్టి చూస్తే నాగార్జున హోస్ట్ చాలా మందికి నచ్చింది.
ఇక ఈ 5వ వారం బిగ్ బాస్ మిని లాంచ్ ఉండనుందని తెలుస్తోంది. ఇక కొంత మంది కంటెస్టెంట్స్ హోజ్ లోకి ఎంట్రి ఇవ్వనున్నారు. ఇప్పటికే హౌజ్ లో ప్రశాంత్ క్యాప్టెన్ గా ఎంపిక అయ్యారు. ఇక మున్ముందు ఎలా ఉందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











