Bigg Boss Telugu 7లోకి మళ్లీ ఆ విలన్.. గత సీజన్ లో రన్నరప్.. ఈసారైన కప్పు కొడతాడా?

బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి భారతదేశంలోకి బిగ్ బాస్ గా వచ్చింది. మొదట్లో ఎలా ఉంటుందో అనుకున్న ఈ రియాలిటీ షోపై ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ కనబర్చారు. దీంతో వివిధ భాషల్లోకి తీసుకురావడం మొదలు పెట్టారు. అలా తెలుగులో 2017లో మొదటి సీజన్ ను ప్రారంభించారు. ఇటీవల డిసెంబర్ 18న ఆరో సీజన్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ తోపాటు ఓటీటీ రెండో సీజన్ ను కూడా ప్రారంభించాలను ప్లాన్ చేస్తోంది బీబీ టీమ్. అందుకోసం పాపులర్ సెలబ్రిటీలనే తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఏడో సీజన్ కోసం ఒకప్పుడు రన్నరప్ గా నిలిచిన విలన్ ను తీసుకోనున్నారట.

ఆరో సీజన్ మినహా..

ఆరో సీజన్ మినహా..

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న షో బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. వీటిలో ఇటీవల పూర్తయిన ఆరో సీజన్ మినహా మిగతా సీజన్లన్నీ మంచి రేటింగ్ నే సొంతం చేసుకున్నాయి.

గ్రాండ్ ఫినాలేలో కూడా ట్విస్ట్..

గ్రాండ్ ఫినాలేలో కూడా ట్విస్ట్..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోనూ గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులతో, అనుకోని సంఘటనలతో, అరుపులు, వెటకారాలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్ లతో సాగిన ఆరో సీజన్ ఫినాలేలో కూడా ట్విస్ట్ ఎదురైంది. మొత్తంగా ఈ సీజన్ లో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ కు టైటిల్ రాగా.. శ్రీహాన్ ప్రేక్షకుల ఓట్లతో టాప్ 1లో ఉండాల్సినవాడు డబ్బు తీసుకోవడంతో రన్నరప్ గా నిలిచాడు.

అట్టర్ ఫ్లాప్ కారణంగా..

అట్టర్ ఫ్లాప్ కారణంగా..

బిగ్ బాస్ షో తెలుగు ఆరో సీజన్ మాత్రం చాలా నిరాశజనకంగానే సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రభావం కూడా పడటంతో కొంతమంది హానెస్ట్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు తలెత్తాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఈ ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ గా మారింది. అందువల్లే ఈ సీజన్ తర్వాత నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలయ్యకు భారీ ఆఫర్..

బాలయ్యకు భారీ ఆఫర్..

హోస్ట్ గా నాగార్జున తప్పుకోవడంతో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని ఒక టాక్ వినిపిస్తే.. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా హోస్ట్ చేయనున్నాడని మరో వార్త వినిపిస్తోంది. ఇందులో రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం అందితే.. బాలకృష్ణకు బీబీ టీమ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

సెప్టెంబర్ లో ప్రారంభించాలని..

సెప్టెంబర్ లో ప్రారంభించాలని..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈసారి ఎలాగైన ఏడో సీజన్ ను హిట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది బీబీ టీమ్. అందుకు అనుగుణంగానే ప్రణాలికలు రచిస్తోంది. అయితే బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ను ఆరో సీజన్ లాగే సెప్టెంబర్ లో ప్రారంభించాలను ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే హీరోలు, పాపులర్ టెలివిజన్ యాక్టర్స్, సింగర్స్, గత సీజన్ రన్నరప్స్ ను అప్రోచ్ అవుతూ డీల్ కుదుర్చుకుంటోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్.

ఓటీటీ మొదటి సీజన్ కు నో..

ఓటీటీ మొదటి సీజన్ కు నో..

బిగ్ బాస్ తెలుగు 7 కోసం గత సీజన్లోని రన్నరప్స్ వెంట బీబీ టీమ్ పడుతుందని తెలిసిందే. అందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణను అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే ఇదివరకు ఓటీటీ మొదటి సీజన్ కోసం ఆదర్శ్ ను అడిగితే అప్పుడు ఆదర్శ్ నో చెప్పాడట. ఇప్పుడు బిగ్ బాస్ 7 కోసం అతన్ని సంప్రదించినట్లు సమాచారం.

కప్పు కొడతాడా..

కప్పు కొడతాడా..

మొదటి సీజన్ లో టైటిల్ ను నటుడు శివబాలాజీ సొంతం చేసుకోగా తనదైన ఆట తీరుతో చివరి వరకు పోరాడి రన్నరప్ గా నిలిచాడు ఆదర్శ్ బాలకృష్ణ. బిగ్ బాస్ కు ముందు తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, నెగెటివ్ షేడ్స్ తో అలరించిన ఆదర్శ్ మరి ఈసారైన కప్పు కొడతాడా లేదా అనేది చూడాలి. అయితే మరి ఈ బిగ్ బాస్ 7 ఆఫర్ ను ఆదర్శ్ అంగీకరించాడా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X