twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 7లోకి పాపులర్ యూట్యూబర్.. నిహారిక కొణిదెలకు ఫ్రెండ్ కావడంతో అవకాశమా?

    |

    బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి భారతదేశంలోకి బిగ్ బాస్ గా వచ్చింది. మొదట్లో ఎలా ఉంటుందో అనుకున్న ఈ రియాలిటీ షోపై ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపించారు. దీంతో వివిధ భాషల్లోకి తీసుకురావడం మొదలు పెట్టారు. అలా తెలుగులో 2017లో మొదటి సీజన్ ను ప్రారంభించారు. ఇటీవల డిసెంబర్ 18న ఆరో సీజన్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక సీజన్ పూర్తి కాకముందే మరో సీజన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు బీబీ నిర్వాహకులు. అందులో భాగంగానే పాపులర్ సెలబ్రిటీలను తీసుకుంటున్నారు.

    ఇప్పటికీ ఆరు టీవీ సీజన్లు..

    ఇప్పటికీ ఆరు టీవీ సీజన్లు..

    ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. మొదటి సీజన్ డూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. వీటిలో ఇటీవల పూర్తయిన ఆరో సీజన్ మినహా మిగతా సీజన్లన్నీ మంచి రేటింగ్ నే సొంతం చేసుకున్నాయి.

    ప్రేక్షకుల ఓట్లతో మాత్రం..

    ప్రేక్షకుల ఓట్లతో మాత్రం..

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోనూ గతంలో ఎన్నడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, వెటకారాలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్ లతో సాగిన ఆరో సీజన్ ఫినాలేలో కూడా ట్విస్ట్ ఎదురైంది. మొత్తంగా ఈ సీజన్ లో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ కు టైటిల్ రాగా.. శ్రీహాన్ ప్రేక్షకుల ఓట్లతో టాప్ 1లో ఉండాల్సినవాడు డబ్బు తీసుకోవడంతో రన్నరప్ గా నిలిచాడు.

    హోస్టింగ్ బాధ్యతల నుంచి..

    హోస్టింగ్ బాధ్యతల నుంచి..

    బిగ్ బాస్ షో తెలుగు ఆరో సీజన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా డిసప్పాయింటే చేసిందనే చెప్పాలి. ఈ సీజన్ లో జరిగిన ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రభావంతో కొంతమంది నిజాయితీ గల కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు తలెత్తాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఈ ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ గా మారింది. అందువల్లే ఈ సీజన్ తర్వాత నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

     బాలకృష్ణకే బీబీ టీమ్ ఓట్?

    బాలకృష్ణకే బీబీ టీమ్ ఓట్?

    కింగ్ నాగార్జున హోస్ట్ గా తప్పుకోవడంతో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని ఒక టాక్ వినిపిస్తే.. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా హోస్ట్ చేయనున్నాడని మరో వార్త వినిపిస్తోంది. ఇందులో రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం అందితే.. బాలకృష్ణకు బీబీ టీమ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

    గత సీజన్ తరహాలో..

    గత సీజన్ తరహాలో..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈసారి తీసుకొచ్చే ఏడో సీజన్ ను ఎలాగైన సూపర్ హిట్ చేయాలని ప్రయత్నిస్తోంది బీబీ టీమ్. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే ఈ బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ను గత సీజన్ ఆరు దానిలాగే సెప్టెంబర్ లో ప్రారంభించాలను ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే హీరోలు, పాపులర్ టెలివిజన్ యాక్టర్స్, సింగర్స్, గత సీజన్ రన్నరప్స్ ను అప్రోచ్ అవుతూ డీల్ కుదుర్చుకుంటోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్.

    పాపులర్ యూట్యూబర్ తో..

    పాపులర్ యూట్యూబర్ తో..

    ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 1 సీజన్ రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణ, హీరో నవదీప్ ను అప్రోచ్ అయిన బీబీ నిర్వాహకులు తాజాగా ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో మంతనాలు జరుపుతున్నారట. నిఖిల్ ప్రస్తుతం యూట్యూబర్ గా బాగానే పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయడంతోపాటు పలు పోగ్రామ్స్ కి హోస్ట్ గా కూడా వ్వవహరించాడు.

    హాలో వరల్డ్ తో వచ్చిన ఫేమ్ తో..

    అంతేకాకుండా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా.. హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ప్రముఖ ఓటీటీ జీ5లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ బాగానే ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ కు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించింది. అలాగే నిఖిల్, నిహారిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. నిహారిక ఫ్రెండ్ కావడం, వెబ్ సిరీస్ తో వచ్చిన ఫేమ్ తోనే నిఖిల్ ను కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నారని ఒక టాక్ అయితే నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇంతకుముందు బిగ్ బాస్ లోకి యూట్యూబర్స్ గా.. షణ్ముఖ్ జశ్వంత్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా దీప్తి సునైనా, గీతూ రాయల్ కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు.

    English summary
    Bigg Boss Telugu 7 Season Team Approaching Youtuber Nikhil Vijayendra Simha For Participating As Contestant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X