Bigg Boss Telugu 7 నుంచి క్రేజీ అప్డేట్.. ఆరోజు నుంచే మొదలు.. అవి ఉంటే కష్టాలే!

తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే టైటిల్ తో అమెరికాలో ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన ఈ షో తర్వాత ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. హిందీలో మొదటగా వచ్చిన ఈ షో మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో వివిధ భాషల్లో కూడా బిగ్ బాస్ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ నడుస్తోంది. అయితే తెలుగులో ఇప్పటికీ 6 రెగ్యులర్, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. తాజాగా బిగ్ బాస్ తెలుగు 7కు సంబంధించిన క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటనే విషయంలోకి వెళితే..

6 రెగ్యులర్-1 ఓటీటీ:ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో.

Bigg Boss Telugu 7 Team Planning To Complete BB House Within August Second Week

ట్విస్టుతో పూర్తి:గతంలో ఎన్నడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, వెటకారాలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్ లతో సాగిన ఈ ఆరో సీజన్ ఫినాలేలో కూడా ట్విస్ట్ తోనే పూర్తి అయింది.

భారీ నెగెటివిటీ:మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ కు టైటిల్ రాగా.. శ్రీహాన్ ప్రేక్షకుల ఓట్లతో టాప్ 1లో ఉండాల్సినవాడు డబ్బు తీసుకోవడంతో రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్లలో ఆరో సీజన్ భారీగా నెగెటివిటీ మూటగట్టుకుంది.

Bigg Boss Telugu 7 Team Planning To Complete BB House Within August Second Week

రేటింగ్ సైతం:బిగ్ బాస్ షో తెలుగు ఆరో సీజన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా నిరాశపరచడంతో వచ్చే బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే ఆరో సీజన్ లో జరిగిన ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రభావంతో కొంతమంది నిజాయితీ గల కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు విపరీతంగా తలెత్తాయి. అందుకే రేటింగ్ కూడా సరిగా రాకపోగా బిగ్ బాస్ నమ్మకాన్ని కూడా కోల్పోయిందనేది టాక్.

Bigg Boss Telugu 7 Team Planning To Complete BB House Within August Second Week

జోరుగా ప్రచారం:బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లోకి ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారనేదానిపై అనేక వార్తలు వచ్చాయి. ఇందులో ఎక్కువగా 10 లేదా 100 మంది రియల్ లైఫ్ జంటలను తీసుకోనున్నారని, సింగర్స్ కు కూడా అవకాశం ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే ఏడో సీజన్ కు హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి పేర్లు వినిపించాయి. మరి ఎవరు వస్తారనే దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

Bigg Boss Telugu 7 Team Planning To Complete BB House Within August Second Week

ఒక నెలలో:అయితే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే.. ఈ సీజన్ హౌజ్ పనులను జూలై 10 నుంచి మొదలు పెడతారట. ఒక నెలలో బీబీ హౌజ్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఆగస్టు రెండో వారానికి సిద్ధం చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ఏడో సీజన్ ప్రారంభించనున్నారట. కానీ వర్షాలు మాత్రం పడితే బీబీ హౌజ్ రెడీ చేయడం మరింత ఆలస్యం అవుతుంది. దీందీ నిర్వాహకులకు కష్టాలే అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X