Bigg Boss Telugu 7 షాకింగ్.. కంటెస్టెంట్స్ అందరూ భార్యాభర్తలు? చరిత్రలోనే తొలిసారిగా!

బిగ్ బ్రదర్ అనే టైటిల్ తో అమెరికాలో ప్రారంభమై సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత ఈ షో బిగ్ బాస్ గా హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ షో ఎంతో ప్రత్యేకతను అందుకుంటూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ రియాలిటీ షో బిగ్ బాస్ ను ఒక హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలుగులోకి కూడా తీసుకొచ్చారు.

అయితే మొదట్లో అనేక అనుమానాలు, అంచనాలతో మొదలైన ఈ బిగ్ బాస్ విపరీతమైన ప్రేక్షకాదరణను పొందింది. దీంతో వరుసగా సీజన్ల మీద సీజన్లు నిర్వహిస్తోంది బీబీ టీమ్. ఇటీవల 2022 డిసెంబర్ 18న ఆరో సీజన్ పూర్తి కాగా.. బిగ్ బాస్ తెలుగు 7 కోసం భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

6 రెగ్యులర్, 1 ఓటీటీ..

6 రెగ్యులర్, 1 ఓటీటీ..

ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. వీటిలో ఇటీవల పూర్తయిన ఆరో సీజన్ మినహా మిగతా సీజన్లు అన్నింటికి మంచి రేటింగ్ ను సాధించాయి.

ట్విస్ట్ తోనే ఫినాలే పూర్తి..

ట్విస్ట్ తోనే ఫినాలే పూర్తి..

గతంలో ఎన్నడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, వెటకారాలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్ లతో సాగిన ఈ ఆరో సీజన్ ఫినాలేలో కూడా ట్విస్ట్ తోనే పూర్తి అయింది. మొత్తంగా ఈ సీజన్ లో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ కు టైటిల్ రాగా.. శ్రీహాన్ ప్రేక్షకుల ఓట్లతో టాప్ 1లో ఉండాల్సినవాడు డబ్బు తీసుకోవడంతో రన్నరప్ గా నిలిచాడు.

బిగ్ బాస్ పై పోయిన నమ్మకం..

బిగ్ బాస్ పై పోయిన నమ్మకం..

బిగ్ బాస్ షో తెలుగు ఆరో సీజన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ లో జరిగిన ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రభావంతో కొంతమంది నిజాయితీ గల కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు విపరీతంగా తలెత్తాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాకపోగా బిగ్ బాస్ పై నమ్మకాన్ని కూడా కొంత వరకు కోల్పోయిందనేది టాక్. దీంతో ఈ ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ గా మారింది.

హోస్ట్ గా ఎవరు వస్తారో..

హోస్ట్ గా ఎవరు వస్తారో..

బిగ్ బాస్ తెలుగు 6లో అనేక పరిణామాలు చోటుచేసుకోవడం, అవన్నీ నాగార్జునకు నచ్చకపోవడంతో తర్వాతి సీజన్స్ కి హోస్ట్ గా తప్పుకోనున్నారని టాక్ నడుస్తోంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని ఒకవైపు వార్తలు వినిపిస్తే.. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా హోస్ట్ చేయనున్నాడని మరో వార్త వినిపిస్తోంది.

ఇందులో రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం అందితే.. బాలకృష్ణకు బీబీ టీమ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

బిగ్ బాస్ 7పై ఎన్నో వార్తలు..

బిగ్ బాస్ 7పై ఎన్నో వార్తలు..

అయితే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈసారి తీసుకొచ్చే ఏడో సీజన్ ను ఎలాగైన సూపర్ హిట్ చేయాలని ప్రయత్నిస్తోంది బీబీ టీమ్. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.అందుకోసం హీరోలు, పాపులర్ టెలివిజన్ యాక్టర్స్, సింగర్స్, గత సీజన్ రన్నరప్స్, యూట్యూబర్స్ ను అప్రోచ్ అవుతూ డీల్ కుదుర్చుకుంటున్నట్లు ఇన్ని రోజులు వార్తలు షికార్లు చేశాయి.

వారిలో బిగ్ బాస్ తెలుగు 1 సీజన్ రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణ, హీరో నవదీప్, యాక్టర్ అమర్ దీప్-తేజస్విని గౌడ్, సింగర్ మోహన భోగరాజు, నిఖిల్ విజయేంద్ర వంటి వారిపేర్లు వినిపించాయి.

రియల్ లైఫ్ కపుల్స్ తో బిగ్ బాస్..

రియల్ లైఫ్ కపుల్స్ తో బిగ్ బాస్..

అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7కు సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈసారి ఈ సీజన్ లో ఇంటి సభ్యులందరినీ రియల్ లైఫ్ కపుల్స్ ను (భార్యాభర్తలు) తీసుకోనున్నట్లు సమాచారం. అంటే మొత్తంగా 10 లేదా 11 మంది జోడీలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ కానున్నారట. దీనిలో ఎంత నిజముందో కాని ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో వీరిలో సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్-తేజస్విని గౌడ్ కచ్చితంగా ఉంటారని తెలుస్తోంది.

 సెప్టెంబర్ లోనే ప్రారంభం..

సెప్టెంబర్ లోనే ప్రారంభం..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమను ఇంకా ఎవరు కాంటాక్ట్ అవ్వలేదని, సీరియల్స్ కారణంగా బిగ్ బాస్ లో చేయడం కుదరదని అమర్ దీప్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్స్ అందరూ జోడీలు అయితే ఈ ఇద్దరిని ఎలాగైనా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికీ కపుల్స్ సందడి చేసిన విషయం తెలిసిందే.

అలా ఆరో సీజన్ లో మెరీనా అబ్రహం-రోహిత్ సహ్ని, మూడో సీజన్ లో వరుణ్ సందేశ్-వితికా షేరు కపుల్స్ గా ఆకట్టుకున్నారు. ఇక ఈ ఏడో సీజన్ ను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నారని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X