Bigg Boss 7 Teluguలోకి మొత్తం కాంట్రవర్సీ బ్యాచ్.. బూతులు మాట్లాడేవాళ్లే కంటెస్టెంట్స్
బుల్లితెరపై అనేక షోలు వచ్చినప్పటికీ అత్యధికంగా పాపులారిటీ సంపాందించుకున్న వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాలిటీ షో ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సెలబ్రిటీ షో గా వచ్చిన దీంట్లో మొదటి సీజన్ లో అందరూ సినీ తారలతో సాగింది. కానీ, ఆ తర్వాత వచ్చిన సీజన్ నుంచి బుల్లితెర తారలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్, సీరియల్ యాక్టర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu 7) సీజన్ సందడి మొదలు కానుంది. దీంట్లో కంటెస్టెంట్ గా బూతులు మాట్లాడేవాళ్లు, కాంట్రవర్సీ బ్యాచ్ ను దింపుతున్నట్లుగా తెలుస్తోంది.
2017లో స్టార్ట్ : టెలివిజన్ పై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ (Bigg Boss) ఒకటి. ప్రస్తుతం సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. 2017లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది.

నమ్మకం పోయేలా : ఎప్పటిలానే ఎన్నో అంచనాల నడుమ ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వాహకులు అంగరంగ వైభవంగా 2022లో మొదలు పెట్టారు. కానీ, సరికొత్త ప్రయోగాలు, ప్రైజ్ మనీ కోతలు ఏం చేసినా సరే మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఆరో సీజన్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఫేక్ ఎలిమినేషన్స్, ఫేవరిజం వంటి తదితర కారణాలతో తీవ్రమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. దీంతో బిగ్ బాస్ పై కాస్తా నమ్మకం కూడా పోయింది.
సరికొత్త కాన్సెప్టుతో : ఇలా పలు కారణాలతో బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ కావడంతో ఏడో సీజన్ ను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బిగ్ బాస్ మేనేజ్ మెంట్ టీమ్ ఉందని తెలుస్తోంది. అందుకే ఈసారి సరికొత్త కాన్సెప్టుతో వస్తున్నట్లు ఇదివరకు విడుదల చేసిన ప్రోమోలా ద్వారా చూపించారు బిగ్ బాస్ మేకర్స్. ఇక ఈ షోను సెప్టెంబర్ 1కి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 1, 2, తేదీలు షూట్ చేసి 3వ తేదిన టెలీక్యాస్ట్ చేయనున్నారు.

ఉల్టా పల్టా : మొత్తానికి మళ్లీ బిగ్ బాస్ సందడి నెలకొననుంది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమోను ఇదివరకే విడుదల చేశారు. ఇటీవల నాగార్జునే హోస్ట్ అన్నట్లుగా క్లారిటీ కూడా ఇస్తూ ప్రొమో వీడియో ఒకటి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్" అంటూ సీజన్ 7కి మీనింగ్ వచ్చేలా క్యూరియాసిటీ పెంచేశారు. తర్వాత ఉల్టా పల్టా అంటూ ఊహించని కాన్సెప్ట్ అని నాగ్ అన్నారు.

కంటెస్టెంట్స్ : ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుటికే కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిపోయారని టాక్. వారిలో కార్తీక దీపం శోభా శెట్టి, మొగలి రేకులు సాగర్ ఉన్నట్లు సమాచారం వచ్చింది. అయితే సింగర్ దామిని, మై విలేజ్ షో అనిల్ ఇద్దరూ ఖరారు అయినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఆట సందీప్, అతని భార్య జ్యోతి ఇద్దరు కూడా పాల్గొననున్నారట.

దరిద్రమైన బూతులు : ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ తెలుగు 7లోకి ఎక్కువగా కాంట్రవర్సీ బ్యాచ్ ను మేకర్స్ దింపుతున్నట్లుగా సమాచారం. వారిలో కొంతమంది దరిద్రమైన బూతులు మాట్లాడే బ్యాచ్ కూడా ఉందని టాక్. బిగ్ బాస్ తెలుగు 6 ప్లాప్ నుంచి జనాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంగా బిగ్ బాస్ 7ను మొత్తం గొడవలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని బీబీ టీమ్ ప్లాన్ చేసిందట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











