Bigg Boss Nominations: 10వ వారం నామినేషన్స్ లీక్.. టాప్ కంటెస్టెంట్లకు షాక్.. ఎవరెవరు అయ్యారంటే!

బిగ్ బాస్.. ఈ షోకు అస్సలు పరిచయమే అవసరం లేదు. అంతలా ఇది సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను నడుపుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దానిని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో రన్ చేస్తున్నారు. గతంలో కంటే కొత్త కొత్తగా సాగుతోన్న ఈ సీజన్‌లో నామినేషన్స్ టాస్కులు విభిన్నంగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే పదో వారం కొత్త కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. మరి ఇందులో ఈ వారానికిగానూ ఎవరెవరు నామినేట్ అయ్యారో మీరు కూడా చూసేయండి మరి!

అనుకోని మలుపులతో సాగుతూ: బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకూ జరిగిన సీజన్లలో కంటెంట్ ఒకేలా కనిపించింది. కానీ, ఏడో సీజన్‌లో మాత్రం ఉల్టా పుల్టా కాన్సెప్టు కారణంగా ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ట్విస్టులు, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటున్నాయి. ఫలితంగా ఈ సీజన్‌ గతంలో కంటే ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

Bigg Boss Telugu 7 Tenth Week Nominations Details Revealed

ఏడుగురు లేడీస్.. ఇద్దరు వీళ్లు: ఈ సీజన్‌లోకి మొదట 14 మంది, ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురు, ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్, తొమ్మిదో వారంలో తేజ వెళ్లిపోయారు.

నామినేషన్స్‌కు రాజమాతలు: ఏడో సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు నామినేషన్స్ టాస్కులను కొత్తగా తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే 10వ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియను 'రాజమాత, ప్రజా' అనే కాన్సెప్టుతో డిజైన్ చేశారు. ఇందులో ప్రియాంక, శోభ, అశ్విని, రతికలు రాజమాతలుగా ఉంటారు. మగ కంటెస్టెంట్లు మగాళ్లనే నామినేట్ చేయాలి. దీనికి రాజమాతలు ఒప్పుకోవాల్సి ఉంటుంది.

యమా గొడవలు జరిగాయిగా: బిగ్ బాస్ షో మొత్తన్ని ప్రభావితం చేసే టాస్కుల్లో నామినేషన్స్ ఒకటి అని చెప్పాలి. అందుకే ఈ టాస్కు జరుగుతున్న సమయంలో గొడవలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పదో వారం నామినేషన్స్‌లో భోలే షావలితో ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టిలు గొడలు పెట్టుకున్నారని తెలిసింది. అలాగే, రాజమాతలకు కూడా వాదనలు జరిగినట్లు ఓ న్యూస్ లీకైంది.

మగాళ్లంతా నామినేషన్స్‌లో: ఏడో సీజన్‌లోని పదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఉన్న ఏడుగురు మేల్ కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో ప్రిన్స్ యావర్, శివాజి, అమర్‌దీప్ చౌదరి, అంబటి అర్జున్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, భోలే షావలిలు ఉన్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X