Bigg Boss Telugu 7: టికెట్ టు ఫినాలేలో ఉహించని ట్విస్ట్.. ఫస్ట్ ఫైనాలిస్ట్ ఎవరయ్యారంటే?

బిగ్ బాస్ తెలుగు 7 ఇంట్రెస్టుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రియాలిటీ షో మరో 17 రోజుల్లో ముగియనుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్కులు నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఐదు మంది కంటెస్టెంట్స్ ఔట్ అయి.. అమర్ దీప్ టాప్ లో ఉండగా.. ఇప్పుడు టికెట్ టు ఫినాలే విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే బెటర్ గా కొనసాగుతోంది. ఇక మరో 17 రోజుల్లో ఈ షోకి ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. ఇక ఈ సీజన్ టాప్ 7 కంటెస్టెంట్స్ ఫినాలేకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 13వ వారం అమర్ దీప్ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు.

Bigg Boss Telugu 7 Ticket to Finale Winner Arjun Ambati Full Details Here

శివాజీ, యావర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, ప్రియాంక, శోభా ఇలా 7 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఓటింగ్ చూస్తే.. అర్జున్ అంబటి, శోభా శెట్టి, యావర్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. శుక్రవారం అర్దరాత్ర 12 గంటలకు ఓటింగ్ ముగియనుంది. ఈ వారం పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడితే.. ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అంటున్నారు.

Bigg Boss Telugu 7 Ticket to Finale Winner Arjun Ambati Full Details Here

ఇక హౌస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్కులు నిర్వహించాడు బిగ్ బాస్. ఈ వారం మొత్తం అవే టాస్కులు జరిగాయి. ఇక టికెట్ టు ఫినాలేలో నువ్వా నేనా అన్నట్లుగా కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. శోభా శెట్టి, శివాజీ మొదటగానే ఔట్ అవ్వగా.. ఆ తర్వాత యావర్, గౌతమ్, ప్రియాంక ఔట్ అయ్యారు. ఇక ఈరోజు ప్రశాంత్ కూడా ఔట్ అయ్యాడు.

ఇక మిగిలింది అమర్ దీప, అర్జున్ అంబటి. వీరి మధ్య కూడా పోటా పోటీగా టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ సారి టికెట్ టు ఫినాలేలో అమర్ దీప్ కు 1100 పైగా పాయింట్స్ తో టాప్ లో ఉండే. ఇక అంబటి అర్జున్ 910.. అయితే అమర్ దీప్ వేరే వాళ్లను పాయింట్స్ అడుక్కుని టాప్ లోకి వచ్చాడు. అయితే వీరిద్దరికి మరో టాస్క్ పెట్టగా.. టికెట్ టు ఫినాలే విన్నర్ ఎవరో తెలిసిపోయింది.

Bigg Boss Telugu 7 Ticket to Finale Winner Arjun Ambati Full Details Here
బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ విన్నర్ అర్జున్ అంబటి. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఇతను బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫస్ట్ ఫైనాలిస్ట్ గా నిలిచాడు. అలా అర్జున్ అంబటి టికెట్ టు ఫినాలే గెలిచి.. టాప్ 5లో ఉండనున్నాడు. మరి ఈ సీరియల్ హీరో.. కప్ కొట్టకపోవచ్చు కానీ.. ఇలాగే ఆడితే టాప్ 3లో నిలిచే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X