Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ టాప్ 3 కంటెస్టెంట్స్ వీళ్లే... ఉల్టా పుల్టాగా మారిన టైటిల్ విన్నర్!
బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు 7 అత్యధిక ప్రేక్షకాదరణతో ముందుకువెళ్తోంది. ఇక సీజన్ చివరి అంకానికి చేరుకుంది. మరో ఐదు వారాల్లో ఈ షో ముగియనుంది. ఇక ఇప్పటికే ఈ షో సక్సెస్ ఫుల్ గా 11 వారాలు పూర్తి చేసుకోబోంది. ఇదిలా ఉంటే టాప్ 5 కంటెస్టెంట్స్, టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మొన్నటి ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీ మెంబర్స్ టాప్ 5 కంటెస్టెంట్స్ పెట్టారు. అదే కాకుండా బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి అందుతున్న సమాచారం మేరకు టాప్ 3లో ఎవరు ఉన్నారు.. ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విపరీతంగా ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... 11వ వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోబోతుంది. ఇక మరో నాలుగు వారాల్లో ఈ షో పూర్తి కానుంది. ఇక టాప్ 3 ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్నది శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, గౌతమ్, అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ ఉన్నారు. ఇక వీరిలో ఎవరు టాప్ 3కి వెళ్తారు అనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ అయ్యారు. అందులో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు, నయని పవని, పూజా మూర్తి, టేస్టీ తేజ, ఆట సందీప్, బోలే షవాలి ఎలిమినేట్ అయ్యారు. ఇక రతికా రోజ్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్ గా శివాజీ ఉన్నారు. ఇక నెక్ట్స్ వీక్ కెప్టెన్ గా ప్రియాంక జైన్ ఎన్నిక అయ్యారు.
ఇక మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా ఉండగా.. మొన్నటి ఫ్యామిలీ వీక్ లో చాలా మంది టాప్ 3లో ఉంచింది మాత్రం ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ నే. వారు ఎవరంటే.. ఒకరు శివాజీ కాగా.. మరో వ్యక్తి ప్రశాంత్, ప్రిన్స్ యావర్. వీరు ముగ్గురు టాప్ 3లో ఉంటారని చాలా మంది భావించారు.

ఇక బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం ప్రకారం.. సోషల్ మీడియాలో సర్వే ప్రకారం ఈ సీజన్ టాప్ 3లో ఉండేది శివాజీ, ప్రశాంత్, యావర్. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ సీజన్ విన్నర్ అంటే మొన్నటి వరకు శివాజీ అనే వాళ్లు. కానీ ఇప్పుడు ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి.. మరో వ్యక్తిని సీజన్ విన్నర్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ టీమ్ టైటిల్ విన్నర్ ను ఫిక్స్ చేసిందంట.

అయితే ఓ కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. జనాల్లోకి బాగా పాపులర్ అయ్యారట. ఇక ఆయన గేమ్స్, టాస్కులు సైతం బాగా ఆడుతున్నాడు. అయితే ఈ సారి సీజన్ విన్నర్ ప్రశాంత్ అని తెలుస్తోంది. ఒక కామన్ మ్యాన్ కు టైటిల్ విన్నర్ ఇస్తే... బిగ్ బాస్ కు కూడా మంచి పేరు వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సారి టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే.. మరింత మందికి ఈ బిగ్ బాస్ ఆదర్శం అవుతుంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











