Bigg Boss Telugu 7 Winner పల్లవి ప్రశాంత్.. కుక్కలా తిరిగినోడికే ట్రోఫి.. కానీ ప్రైజ్‌మనీ?
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. సుమారు 105 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ షోకి మొత్తానికి ఎండ్ కార్డ్ పడింది. బిగ్ బాస్ టైటిల్ విజేతను నాగార్జున ప్రకటించారు. మొత్తానికి టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచినా కూడా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ముందు నుంచి జరిగిన ప్రచారం ప్రకారమే ఈ సీజన్ టైటిల్ విన్నర్ రైతు బిడ్డకే దక్కింది. అయితే ఈ సీజన్ లో ఓ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్... చివరకు టైటిల్ విన్నర్ గెలుచుకున్నాడు. ఇక ఈ సీజన్ లో మొదటి 5 వారాలు నెగిటివిటీ వచ్చినప్పటికీ.. ఆ తర్వాతి వారాల్లో తన ఆటను మార్చుకుంటూ వచ్చాడు. వారం వారం.. ఆటను మార్చుతూ... గేమ్ ఛేంజర్ గా నిలిచాడు.

ముఖ్యంగా రతికా వెంటపడి నెగిటివిటీని భారీ ఎత్తున మూటగట్టుకున్నాడు. అయితే ఎలా పసి గట్టాడో కానీ.. రతికాతో ఉంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి.. రతికా అక్క అంటూ ఆమెతో కాళ్ల బేరానికి దిగి.. హౌస్ మేట్స్ కే కాకుండా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడు. వాస్తవానికి ఆ ఎపిసోడ్ నుంచే పల్లవి ప్రశాంత్ గేమ్ మొత్తం మారిపోయింది.
అప్పటి వరకు రతికతో పులిహోర కలపడానికి ఆమె గురించి ఇతర హౌస్మెట్స్ తో చర్చించడానికి.. హౌస్ మేట్స్ తో తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనిపించుకోవడానికి తాపత్రయ పడిన ప్రశాంత్... ఆ దెబ్బతో గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. ఇక అప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ మీదకు అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, సందీప్ ఇటు వంటి వారందరూ ముకుమ్మడిగా ఎటాక్ చేయడం అతనికి కలిసి వచ్చింది. దానికి తోడు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి.. తమ స్థాయి వ్యక్తి కాదని.. అయినా తమతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండనివ్వడమే గొప్ప అన్నట్లుగా హౌస్ మేట్స్ ప్రవర్తన ప్రశాంత్ కు బాగా కలిసి వచ్చింది.

ఏం జరిగినా నేను చూసుకుంటాను.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీకు అన్నగా అండగా ఉంటాము అని శివాజీ ఇచ్చిన భరోసాతో పల్లవి ప్రశాంత్ కూడా తమదైన శైలిలో గేమ్ ఆడుతూ.. పిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తూ.. నామినేషన్స్ విషయంలో కూడా చాకచాక్యంగా వ్యవహారించే వాడు. బిగ్ బాస్ లోపలికి వెళ్లి చూస్తాము అంటూ అన్నపూర్ణ స్టూడియో గెట్ల ముంగిట సెక్యూరిటీ గార్డ్స్ లను బతిమిలాడే స్థాయి నుంచి.. ఇక్కడికి వచ్చి ఏం పీకుతున్నావ్ అంటూ.. అప్పటి వరకు తమతో క్లోజ్ గా ఉన్న రతికా ప్రశ్నించడం.. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కెరియర్లోనే పెద్ద ట్విస్ట్.
ఆ ట్విస్ట్ ను ప్లస్ పాయింటుగా మార్చుకుని.. తమ భుజ బలంతో శివాజీ బుద్ధి బలంతో హౌస్ లో ప్రతి కంటెస్టెంట్ కి పోటీ అయ్యాడు. అయితే శివాజీ, పల్లవి ప్రశాంత్ పోటీ పడితే.. శివాజీకే మద్ధతు లభిస్తుందని.. ఆయనే కప్ కొడతాడని ఎంతో మంది విశ్లేశించారు. కానీ ఆ విశ్లేషణలను అన్నింటినీ తప్పు అయ్యేలా చేస్తూ... శివాజీ మూడో స్థానంలో బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ చివరి వరకు నిలబడి కప్పు కైవసం చేసుకున్నాడు.
మిగతా హౌస్ మేట్స్ అంతా పల్లవి ప్రశాంత్ పైన చూసిన చిన్నచూపు.. ఓటింగ్ ప్రక్రియకు పెద్ద అండగా మారింది. దానికి తోడు నామినేషన్స్ విషయంలో కొన్ని టాస్కుల విషయంలో పల్లవిప్రశాంత్ తో అమర్ దీప్ ప్రవర్తన చాలా మందికి నిబ్బేట్టుగా అనిపించింది. ఇక మొత్తానికి పల్లవి ప్రశాంత్.. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. చివరకు టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇక ఇదంతా బాగా ఉన్నప్పటికీ.. ప్రైజ్ మనీ విషయంలో పల్లవి ప్రశాంత్ కు ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.
ప్రైజ్ మనీ 50లక్షలు అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. అందులోంచి యావర్ 15లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో టైటిల్ విన్నర్ అయిన ప్రశాంత్ కు 35 లక్షల నగదు బహుమతి లభించింది. నగదు బహుమతితో పాటు, పల్లవి ప్రశాంత్‌కు జోయాలుక్కాస్ నెక్లెస్ తో పాటుగా ఒక బ్రీజా కారు కూడా లభించింది.


Click it and Unblock the Notifications










