Bigg Boss Telugu 7: ఈ సీజన్ టాప్ 3 కంటెస్టెంట్లు వీళ్లే.. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదబ్బా!

బిగ్ బాస్ తెలుగు షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన రేటింగ్ తో దుమ్ము లేపుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి బిగ్ బాస్ విన్నర్ టాప్ 5 లిస్ట్ లెక్కలన్నీ ఉల్టాపుల్టాగా మారిపోయాయి. బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పుడు అంతా విన్నర్ గా అమర్ దీప్ గెలుస్తాడని భావించారు. కానీ ఆయన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కావాలని కార్నర్ చేయడంతో విపరీతమైన నెగిటివిటీ సంపాధించుకున్నాడు. రెండో వారంలోనే ఈయన విన్ అవ్వడని ప్రూవ్ చేసుకున్నాడు.

అయితే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు అండగా నిలబడి అద్భుతమైన గేమ్ ఆడుతున్న శివాజి విన్ అవుతాడని ఫ్యామిలీ వీక్ వరకూ అంతా భావించారు. అలాగే టాప్ 2 లో పల్లవి ప్రశాంత్, యావర్ టాప్ 5లోకి కచ్చితంగా వస్తాడని భావించారు. అదే విషయం ఫ్యామిలీ వీక్ లో కూడా రుజువు అయింది. ముఖ్యంగా శివాజియే విన్నర్ అని అంతా ఫిక్సైపోయారు. ఇంట్లో వాళ్లతో పాటు బయట వాళ్లు కూడా అదే అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి అమర్ దీప్ అమాయకంగా గేమ్ ఆడడం ప్రారంభించారు. ఎలాగైనా సరే కెప్టెన్ కావాలని చాలా కసిగా ఆడాడు.

Bigg Boss Telugu 7 Top 3 Contestants Sivaji, Amardeep And Pallavi Prashanth Check Details

కెప్టెన్ కాలేకపోయిన ప్రతీసారి అమర్ దీప ఏడ్చే విధానం చూస్తే నిజంగా అతడు చిన్నపిల్లవాడే అనిపించేలా బిహేవ్ చేశాడు. దీంతో ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా 11, 11, 12వ వారాల్లో ఓటింగ్ లిస్టులో టాప్ 3లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజిలే ఉన్నారు. వీరి గ్రాఫ్ ను ఎవరూ అందుకోలేకపోయారు. అయితే 13వ వారంలో భాగంగా జరుగుతున్న ఇన్సిడెంట్లు చూస్తుంటే శివాజికి చాలా ప్లస్ అవుతున్నాయి. గతవారం కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్ కు సాయపడకుండా గేమ్ ఆడిన శివాజికి అదే నెగిటివ్ అయింది.

Bigg Boss Telugu 7 Top 3 Contestants Sivaji, Amardeep And Pallavi Prashanth Check Details

కానీ ఈ వారం నామినేషన్లలో అంతా కలిసి శివాజిని టార్గెట్ చేయడంతో ఆయనపై పెద్ద ఎత్తున సింపథీ పెరిగిపోయింది. దీంతో ఈ సీజన్ విన్నర్ అతడేనని అంతా అనుకుంటున్నారు. అయితే గేమ్ ముగిసిపోవడానికి మరో రెండు వారాల సమయం ఉండడంతో.. మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులూ జరగవచ్చు. అమర్ దీప్ తో పాటు శివాజి, పల్లవి ప్రశాంత్ లకు ఓట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు. ఏది ఏమైనా టాప్ 3లో ఉండే వాళ్లలో ఈ ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రం కచ్చితంగా ఉంటారని తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 Top 3 Contestants Sivaji, Amardeep And Pallavi Prashanth Check Details

విన్నర్ గా ఎవరు గెలిచినా బుల్లితెర ప్రేక్షకులు షాకవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టాప్ 1 ప్లేస్ లో శివాజి, టాప్ 2లో అమర్ దీప్, టాప్ 3లో పల్లవి ప్రశాంత్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. మరో రెండు వారాల పాటు వీరు చేసే బిహేవియర్ మీదే గేమ్ అంతా ఆధారపడి ఉండగా... టాప్ 3 లో వీళ్ల కన్ఫార్మ్ అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X