Priyanka Jain: శివ్‌కు షాకిచ్చిన ప్రియాంక.. ప్రియుడి కోసం చేయలేని ఆ పని బిగ్‌బాస్ కోసం చేసిందట!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ షోలో పాల్గొన్న మౌనరాగం సీరియల్ నటి ప్రియాంక జైన్ గురించి కూడా అందరికీ తెలిసిందే. షో ముందు వరకు సింగిల్ గా ఉన్నట్లు చెప్పిన ఈమె బిగ్ బాస్ షోలో తన లవ్ గురించి బయట పెట్టేసింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లు చెప్పి... అతడెవరో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే వస్తోంది. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
ఎన్ని సీరియల్స్ చేసినా రాని క్రేజ్ ఈ ఒక్క షో ద్వారా దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కోసం ఫ్యామిలీ వీక్ లో భాగంగా ప్రియుడు వచ్చాడు. హౌస్ లోకి వచ్చి ఆమెతో ఫుల్ గా రొమాన్స్ చేశాడు. ముద్దుల మీద ముద్దులు పెడుతూ.. రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. షోలో ఉండగానే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటూ ప్రియాంక అడిగిన తీరు.. బయటకు రాగానే చేసుకుందామని ఆయన చెప్పిన ఆన్సర్ కు అంతా ఫిదా అయిపోయారు. ఇంత క్యూట్ గా సాగిన వీరి ప్రేమాయణం, రిలేషన్ షిప్ అద్భుతంగా ఉన్నాయి. అందరికీ నచ్చాయి. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ షాకింగ్ విషయం చెప్పింది.

ప్రియుడు శివ్ కుమార్ కోసం చేయలేని ఓ పనిని.. బిగ్ బాస్ కోసం చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం విన్న అంతా షాకయ్యారు. అసలు ఏ విషయంలో ప్రియాంక అలా చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ షో తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ ఒక్క షోలో కూడా కనిపించలేదు. కానీ తాజాగా ఈమె ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ఈవెంట్ కు వచ్చింది. ఈ షోలో భాగంగానే అదిరిపోయే కామెంట్లు చేసి అందరికీ గట్టి షాకిచ్చింది. తన పర్సనాలిటికంటే కూడా ఇంకా పొట్టి డ్రెస్ ను వేసుకుని రచ్చ చేసింది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది.
ఇలా స్టేజీపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మతో యాంకర్ శ్రీముఖి మాట్లాడింది. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు అడిగింది. టాస్క్ కోసం హెయిర్ కట్ చేసుకున్నావు ఓకే.. కానీ శివ్ కుమార్ అడిగితే చేయించుకునేదానివా అంటూ శ్రీముఖి అనగానే.. వెంనటే ప్రియాంక జైన్ నో అని చెప్పేసింది. తాను ప్రియుడి కోసం ఇలాంటివి చేయనని.. కేవలం బిగ్ బాస్ కోసం మాత్రమే చేసుకుంటానని వెల్లడించింది. ఇది విన్న అందరూ షాకయ్యారు. కొంత మంది మాత్రమే నవ్వారు. ప్రియాంక జైన్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇక ఆ తర్వాత ఓ టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. బ్లాక్ బోర్డుపై ప్రిన్స్ యావర్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజి, అంబటి అర్జున్ ల ఫొటోలు పెట్టి కొన్ని ఎమోజీలు ఇచ్చారు. కారణాలు చెబుతూ వాటిని తనకు నచ్చిన వాళ్లకు ఇవ్వమన్నారు. ఈక్రమంలోనే ప్రియాంక పంచ్ ను అమర్ దీప్ కు ఇచ్చింది. హార్ట్ బ్రేక్ సింబల్ ను ప్రశాంత్ కు, దండం సింబల్ ను శివాజికి, ఆంగ్రీని యావర్ కు, అంబటి అర్జున్ కు లవ్ సింబల్ ను డెడికేట్ చేసింది. ఇక పూర్తి విషయాలు తెలియాలంటే ఈరోజు స్టార్ మా ఛానెల్ లో వచ్చే న్యూ ఇయర్ ఈవెంట్ ను చూసేయండి.


Click it and Unblock the Notifications











