Priyanka Jain: గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక జైన్.. అప్పుడే పెళ్లి.. ఇంత సడెన్‌గా ఎందుకు ఫిక్స్ చేసుకున్నారబ్బా

బిగ్ బాస్ తెలుగు 7 టాప్ 5 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లతెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మొదటి వారంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె శోభాశెట్టి, అమర్ దీప్ లతో కలిసి గేమ్ ఆడింది. ఈ ముగ్గురూ చివరి వరకు ఒక్కటిగా ఉండే తమకు నచ్చని వారిని నామినేట్ చేస్తూ.. వాళ్లలో వాళ్లకు సపోర్ట్ చేసుకున్నారు. ఇలా చాలా ఫౌల్ గేమ్స్ ఆడినా అమర్ దీప్ రన్నరప్ గా నిలవడం కాస్త షాకింగ్ విషయమే.

అయితే ముందు నుంచి హౌస్ లో అందరితో చక్కగా ఉన్న ప్రియాంక జైన్ టాప్ 5లో ఉంటుందని చాలా మందే భావించారు. అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఆమె కూడా గేమ్ ఆడి టాప్ 5లో నిలిచింది. ముఖ్యంగా మౌన రాగం సీరియల్ లో కనిపించినట్లుగానే చాలా స్ట్రాంగ్ ఉమెన్ గా ప్రూవ్ చేసుకుంది. ఈమె అందానికి, తెలివికి, ఆట తీరుకు అంతా ఫిదై అయిపోయారు. అతేకాదండోయ్ ఈమె బిగ్ బాస్ కు వచ్చాకా అందరి ముందే ఓ షాకింగ్ విషయాన్ని చెప్పి అందరికీ షాకిచ్చింది. ముఖ్యంగా తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అది కూడా ఓ సీరియల్ యాక్టర్ అవడం.. వారిద్దరూ కలిసి ప్రస్తుతం కలిసే ఉన్నట్లు ప్రకటించింది.

Bigg Boss Telugu 7 Top 5 Contestant Priyanka Jain Revealed Her Marriage Date Wtih Shiv Kumar

అలాగే ఫ్యామిలీ వీక్ లో భాగంగా ప్రియాంక జైన్ కోసం ఆమె తల్లిదండ్రులు రావాల్సి ఉండగా.. ప్రియుడు, కాబోయే వాడు అయిన శివ్ కుమార్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇంట్లోకి వచ్చీ రాగానే ప్రియాంకను గట్టిగా హత్తుకున్నాడు. ముద్దులతో ముంచెత్తాడు. అసలు గ్యాప్ ఇవ్వకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు. ఈక్రమంలోనే ప్రియాంక్ జైన్ పెళ్లెప్పుడు చేసుకుందామంటూ చాలా క్యూట్ గా శివ్ కుమార్ ను అడిగింది. అందుకు అతడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే చేసుకుందామని కూడా చెప్పేశాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ప్రియాంక అదిరిపోయే షాక్ ఇచ్చింది.

పెళ్లంటే చాలా పెద్ద విషయం అంటూ కామెంట్లు చేసింది. అలాగే శివ్ కుమార్ కూడా ప్రియాంక జైన్ బయటకు వచ్చాకా ఎప్పుడంటే అప్పుడే పెళ్లి.. కానీ మేము కెరియర్ లో సెటిల్ అవ్వాలంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. దీంతో చాలా మంది ఫ్యాన్స్ నిరాశపడిపోయారు. అసలు వీరిద్దరికీ పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కానీ ఇవి ఎక్కువ అవడం అభిమానులు అంతా నిరాశ పడడం నచ్చని ఈ జంట తాజాగా పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. అంతేకాదండోయ్ పెళ్లి ఎప్పుడో చేసుకోబోతున్నారో కూడా ప్రకటించారు.

Bigg Boss Telugu 7 Top 5 Contestant Priyanka Jain Revealed Her Marriage Date Wtih Shiv Kumar

అయితే ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న ప్రియాంక జైన్, శివ్ కుమార్ లు వచ్చే ఏడాది అంటే 2024లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చారు. స్పెషల్ గా దీనికోసమే ఓ వీడియో కూడా చేసి పెట్టారు. అలాగే ఓ జ్యువెల్లరీ షాప్ ప్రమోషన్స్ లో భాగంగా ఉంగరాలు కూడా మార్చుకున్నారు. వచ్చే ఏడాది అంటే మరో నెల రోజుల్లో అయినా కావచ్చు.. లేదా 2024 చివర్లో అయినా కావచ్చు. కానీ వీరిద్దరూ మాత్రం పెళ్లి చేసుకోవడం కన్ఫార్మ్. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X