Bigg Boss Telugu 7: ఉల్టా పుల్టాగా మారిపోయిన టాప్ 5 కంటెస్టెంట్స్.. విన్నర్ మాత్రం అతనే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో.. 10 వారాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇక హౌజులో మొదట 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు రాగా.. ఇంకొకరు రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతానికి హౌజ్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ 11 మందిలో 15వ వారం వచ్చే సరికి టాప్ 5 ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మరి టాప్ 5 పేర్లు ఉల్టా పుల్టాగా మారిపోయినట్లు తెలుస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బుల్లితెరపై అత్యధిక అదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇక గత సీజన్స్ కంటే భిన్నంగా ఈ సీజన్ సాగుతోంది. మొదటి నుంచి ఉల్టా పుల్టా అంటూ షో రసవత్తరంగా సాగుతుంది. ఇక ఇదిలా ఉండగా.. ఈ వారం షోలో ఫ్యామిలీ వీక్ పెట్టారు. హౌజులోని కంటెస్టెంట్స్ కోసం.. ఒక్కో ఫ్యామిలీ మెంబర్ వచ్చి కలవడంతో మరింత ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులను బిగ్ బాస్ ఎమోషనల్ చేస్తున్నాడు. దీంతో రేటింగ్ కూడా బాగానే వస్తుందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 Top 5 Contestants:Sivaji, Prashanth, Amardeep, Priyanka, Arjun, Yawar Full Details Here

ఇక హౌస్ లో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. అందులో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, రతికా రోజ్, అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, బోలే షవాలి, గౌతమ్ ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఐదు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, గౌతమ్, బోలే షవాలి, రతికా రోజ్. అయితే యావర్ మాత్రం సెల్ప్ నామినేషన్ చేసుకుని నామినేషన్స్ లోకి వచ్చాడు.

ఇక ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం రతికా రోజ్, బోలే షవాలి. అయితే వీరిద్దరు ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. శుక్రవారం అర్దరాత్రి వరకు ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెప్పలేం. అయితే యావర్ సెల్ఫ్ నామినేషన్ లోకి రావడం.. హాట్ టాపిక్ గా మారింది. అలా వచ్చారంటే..ఆ కంటెస్టెంట్ కప్ కొట్టాలన్న ఆలోచన లేనట్టే అని భావించి.. అతన్ని షాకింగ్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Bigg Boss Telugu 7 Top 5 Contestants:Sivaji, Prashanth, Amardeep, Priyanka, Arjun, Yawar Full Details Here

ఇక ఆ విషయం పక్కన పెడితే... దీపావళి పండుగ సందర్భంగా ఈ వారం ఎలిమినేషన్ లేకపోతే మాత్రం.. 15వ వారం టాప్ 6 కంటెస్టెంట్స్ వెళతారు. ఇక అందులో టాప్ 5 ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు ఉన్న పేర్లు పోయి.. ఇప్పుడు కొత్త పేర్లు వచ్చాయి. టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే మొదటగా మనకు వినిపించే పేర్లు శివాజీ, ప్రశాంత్. ఇక వీరి తర్వాత యావర్ పేరు వినిపించేది. అయితే యావర్ ఈ మధ్య రతికా రోజ్ చెప్పిన మాటలు విని..ట్రాక్ తప్పాడు. దీంతో ఆయనకు ఓటింగ్ కూడా తగ్గుతుంది.

Bigg Boss Telugu 7 Top 5 Contestants:Sivaji, Prashanth, Amardeep, Priyanka, Arjun, Yawar Full Details Here

రతికా రోజ్ ట్రాక్ నుంచి బయటపడితే తప్ప.. యావర్ ను గట్టెక్కే పరిస్థితి లేదు. ఇక టాప్ 3లో మాత్రం అమర్ వచ్చి చేరాడు. ఆయన గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక టాప్ 4లో యావర్ ఎలిమినేట్ కాకపోతే.. ఉండొచ్చు లేదంటే.. అర్జున్ అంబటి ఉండనున్నారు. ఇక టాప్ 5లో లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ నిలవనుంది. ఇక ఈ సారి శివాజీ నాకు వద్దు కప్ అని తప్పుకుంటే కనుక.. ప్రశాంత్ కు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X