Bigg Boss Telugu 7: నామినేషన్స్ వార్‌తో మారిన టైటిల్ రేస్ లెక్కలు.. టాప్ 5లో ఉన్నది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో కానీ అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని విధంగా షో సాగుతుండగా... రోజురోరుజుకూ టాప్ 5 లెక్కలు మారిపోతున్నాయి. అయితే షో ప్రారంభంలో అంటే మొదటి వారంలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికే అంటే వారానికి ఒకరు చొప్పున నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ తర్వాత 2.0 పేరుతో మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌస్ లోకి పంపారు బిగ్ బాస్. వీరితో పాటు ముందు వారంలో నామినేట్ అయిన వారిలోంచి కూడా ఒకర్ని రీఎంట్రీ ఇప్పించారు.
ఇలా షాక్ ల మీద షాకులు.. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో షోను మరింత రసవత్తరంగా మారుస్తున్న బిగ్ బాస్ టీం నిర్వాహకులు... తమకు నచ్చినట్లు చేసుకోవడానికే ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తీసుకు వచ్చారని చాలా మంది భావిస్తున్నారు. అదే నిజం అయినట్లు బిగ్ బాస్ టీం నిర్వాహకులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా బ్యాచ్.. సీరియల్ బ్యాచ్, స్పా గ్రూప్ ను కాపాడుకోవడానికి అనేక ఎత్తులు వేస్తున్నారు. ప్రతిరోజూ షో చూసే వాళ్లకు ఇది చాలా బాగా అర్థం అవుతోంది. అయితే 13వ వారం అర్జున్ అంబటి ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ఫినాలే అస్త్ర గెలుచుకొని టాప్ 5కి చేరుకున్నాడు.

ఇక ఆయన తర్వాత అత్యంత తక్కువగా ఓటింగ్ పొందిన వాళ్లలో శోభాశెట్టి, గౌతమ్ కృష్ణలు ఉండగా... దత్తపుత్రికను కాపాడుకోవడానికే గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ సాగింది. గౌతమ్ ఎలిమినేట్ కావడంంతో ఇంట్లో ఏడుగురు మాత్రమే మిగిలారు. వాళ్లలో ఇప్పటికే గౌతమ్ కృష్ణ ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అతడిని ఎవరూ నామినేట్ చేయడానికి లేదు. ఇలా మిగిలిన వాళ్లంతా నామినేషన్స్ లోకి వచ్చారు. ఈక్రమంలోనే ఈరోజుటి ఓటింగ్ ప్రారంభం అయింది.
నామినేషన్స్ హీటో తో టాప్ 5 లిస్ట్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా విన్నర్, రన్నరప్ లలో కూడా తేడాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పోల్ అయిన నామినేషన్స్ చూస్తుంటే బిగ్ బాస్ ముద్దుబిడ్డలు శోభాశెట్టి, ప్రియాంక జైన్ లు డేంజర్ జోన్ లో ఉన్నారు. ముఖ్యంగా విన్నర్ గా నిలుస్తాడని భావించిన శివాజికి ఈరోజు ఓటింగ్ తగ్గింది. ప్రస్తుతం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్ లిస్టులో ఉన్నాడు. ఇలాగే ఓటింగ్ జరిగితే రైతుబిడ్డే విన్నర్ గా నిలుస్తాడు.
ఈయన తర్వాత అంటే టాప్ 2 ప్లేస్ లో శివాజి ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఎవరూ ఊహించని విధంగా ప్రిన్స్ యావర్ ఉన్నాడు. అలాగే ఫోర్త్ ప్లేస్ లో అమర్ దీప్, ఫిఫ్త్ ప్లేస్ లో శోభా శెట్టి, సిక్త్స్ ప్లేస్ లో ప్రియాంక జైన్ ఉంది. ఈ వారం ఓటింగ్ మొత్తం పూర్తి అయ్యే వరకు ఏమైనా మార్పులు వస్తే చెప్పలేం కానీ అప్పటి వరకు మాత్రం... ఇలాగే కంటిన్యూ అయితే బిగ్ బాస్ దత్తపుత్రికల్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయం. ఇక బిగ్ బాస్ వాళ్లద్దరినీ పంపేందుకు ఇష్ట పడకపోతే.. టాప్ లో ఉన్న యావర్ నే పంపిస్తారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











