Bigg Boss Telugu 7: బిగ్ బాస్ లోకి మరో సీరియల్ నటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఆ గ్రూపుకు ప్లస్సా, మైనస్సా!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7.. ఎందుకు ఉల్టా పుల్టానో ఈరోజుటితో తేలిపోయింది. ఇంతకు ముందు సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 చాలా తక్కువ మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాగా.. 2.0 వర్షన్ పేరు మరికొంత మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి పంపబోతున్నాడు బిగ్ బాస్. గతంలో ముందుగానే కంటెస్టెంట్లను పంపేవాళ్లు, మధ్యలో ఒకరో, ఇద్దరో లేదంటే ముగ్గురో.. అంతుకు మించి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండకపోయేవి.
కానీ ఈసారి మాత్రం 2.0 వర్షన్ పేరుతో సీజన్ ప్రారంభమైన మొదటి రోజు లాగానే ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపించారు. ఈ సీజన్ లో ఎక్కువ మంది సీరియల్ నటులే కంటెస్టెంట్లుగా ఉన్నారని.. ప్రేక్షకులు ఇప్పటికే ఫీలవుతుండగా మరికొంత మంది సీరియల్ నటులు లోపలికి అడుగు పెట్టారు. ఇందులో గుండమ్మ కథ సీరియల్ నటి పూజా మూర్తి కూడా ఉన్నారు.

గుండమ్మ కథ సీరియల్ ద్వారా తెలుగులో విపరీతమైన పాపులారిటీ సంపాధించుకున్న పూజా మూర్తి బిగ్ బాస్ లో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి మరి. సన్నగా, జీరో సైజులో ఉంటేనే ఆఫర్లు వస్తాయి అనుకునే వాళ్లకు.. అవేమిటితో పని లేదు కేవలం టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించింది. బొద్దుగా.. ముద్దుగా కనిపిస్తూనే అందంగా ఉండే ఈ అమ్మాయి సీజన్ ప్రారంభంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాల్సింది. కానీ తొలి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వాల్సింది. సూట్ కేస్ లోపలికి వెళ్లి, ఎంట్రీ సాంగ్ స్పెషల్ వీడియో కూడా పూర్తి అయ్యాక ఆమె ఎంట్రీ ఆగిపోయింది.
ఆమె బిగ్ బాస్ హౌస్ స్టేజీపై ఉండగానే ఆమె తండ్రి చనిపోయినట్లు తెలియడంతో.. ఆమె ఆగమేఘాల మీద బెంగళూరు వెళ్లిపోయింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ వాయిదా పడింది. దీంతో అంతా ఈమె ఇక బిగ్ బాస్ హౌస్ కు రాదనే అనుకున్నారు. ఎందుకంటే... బిగ్ బాస్ రూల్స్ ప్రకారం చెప్పిన సమయానికి రాకపోయినా, ఇతర నిబంధనలు పాటించకపోయినా వారి ఎంట్రీ క్యాన్సిల్ అవుతుంది. కానీ పూజా మూర్తి విషయంలో మాత్రం ఆమె అన్ని నిబంధనలు పాటించింది. అనుకోకుండా తండ్రి చనిపోవడంతో తనకు సంబంధం లేదు. కాబట్టి ఆమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ తీసుకొచ్చారు.

అయితే పూజా మూర్తి సీరియల్ నటి కావడం.. ఇప్పటికే ఇంట్లో ఎక్కువ మంది సీరియల్ నటులే కంటెస్టెంట్లుగా ఉండడంతో ప్రేక్షకులంతా ఏం జరుగుతుందోనని తెగ ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఇంట్లో జరుగుతున్నదంతా చూసి వచ్చి వారు గేమ్ ఎలా ఆడతారోనని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే సీరియల్ నటులు కూడా సీరియల్ గ్యాంగ్ కే సపోర్ట్ చేస్తారా లేక ఇతర కుటుంబ సభ్యులతోనూ కలివిడిగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
సీరియల్ నటుల వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లకు మరింత బలం చేకూరుతుందని.. స్నేహితులంతా కలిసి ఇక గ్రూపుగా ఆడతారని చాలా మంది భావిస్తున్నారు. పల్లవి ప్రశాంత్, శివాజీ లాంటి వాళ్లకు దీని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమోనని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











