Bigg Boss Telugu 7 బిగ్‌బాస్ 7 తెలుగు 2.0.. వైల్డ్‌కార్డ్‌తో 7 గురు.. మరో గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడంటే?

ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్లు వేరు.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ వేరు. ఈ సీజన్ ప్రారంభంలోనే అన్ని సీజన్ల మాదిరిగా ఉండదు. ఈ సీజన్ అంతా ఉల్టాపుల్టా అంటూ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందో అనే విషయంపై సంకేతాలు ఇచ్చాడు.

అందుకు తగినట్టుగానే రెగ్యులర్‌గా కాకుండా కొంత వెరైటీతో షో సాగిపోతున్నది. అయితే ఈ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 7 గురు కొత్త కంటెస్టెంట్లు షోలోకి రాబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీతోపాటు కొన్ని ఉల్టా పుల్టా విషయాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu 7 Version 2.O: 7 Wild Card contestant entry into the Ulta Pulta Show on October 8th

వైల్డ్ కార్డు ఎంట్రీలతో: బిగ్‌బాస్ తెలుగు 7 షో మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. గత నాలుగు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో ఎలిమినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఆరు వారాల్లో ఇంట్లో ఉన్నది కేవలం పది మంది కంటెస్టెంట్లే ఉన్నారు. అయితే చివరి వారంలో కనీసం ఐదుగురు కంటెస్టెంట్లు ఫినాలే కోసం ఉండాల్సిన పరిస్థితి. దాంతో ఇంటిలోకి మరికొందరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Bigg Boss Telugu 7 Version 2.O: 7 Wild Card contestant entry into the Ulta Pulta Show on October 8th

బిగ్‌బాస్ 7 షో 2.O: అయితే బిగ్‌బాస్‌లో ఇప్పటి వరకు ఒక గ్రాండ్ ఓపెనింగ్, ఓ గ్రాండ్ ఫినాలే ఉంటూ వచ్చింది. బిగ్‌బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా కావడంతో అనేక కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో రెండో గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుంది. బిగ్‌బాస్ తెలుగు 7 లో 2.0 గ్రాండ్ ఎంట్రీకి నిర్వాహకులు ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఈవెంట్ 2.0 వేడుక అక్టోబర్ 7వ తేదీన గానీ, 8వ తేదీన గానీ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరో ఏడుగురు ఇంటిలోకి: బిగ్‌బాస్ తెలుగు 7 ప్రారంభానికి ముందు 21 మంది కంటెస్టెంట్స్‌తో ప్లాన్ చేశారు. అయితే కొందరు అనుకోకుండా మధ్యలో డ్రాప్ అయ్యారు. మొగలిరేకులు ఫేమ్ అంజలి పవన్ సాంకేతిక కారణాల వల్ల దూరమైంది. ఈటీవీ ప్రభాకర్ వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి తప్పుకొన్నారు. దాంతో 14 మందితోనే షోను మొదలు పెట్టారు. ఇక మరో ఏడుగురిని ఇంటిలోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేశారు.

Bigg Boss Telugu 7 Version 2.O: 7 Wild Card contestant entry into the Ulta Pulta Show on October 8th

7 కంటెస్టెంట్లు వీరే: అయితే వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చే వారిలో 1. అంబటి అర్జున్, 2. పూజా మూర్తి, 3. భోలే షవాలి,4. అంజలి పవన్, 5. నిఖిల్, 6. విజయేంద్ర సింహా ఉన్నారు. ఏడో కంటెస్టెంట్‌గా దామిని గానీ లేదా మరొకరు కూడా ఉండే అవకాశం ఉంది. ఏడో కంటెస్టెంట్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ ఏడో కంటెస్టెంట్‌ను కొత్తగా తీసుకొంటే.. దామిని 8వ కంటెస్టెంట్‌గా ఇంటిలోకి అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు అనే విషయం బలంగా వినిపిస్తున్నది.

మరో రెండు, మూడు వారాలు పొడిగింపు: ఇక బిగ్‌బాస్‌ తెలుగు 7 సీజన్‌లో మరో ఉల్టా పుల్టా విషయం ఏమిటంటే.. ఈ సీజన్‌ను 10 వారాలుగా నిర్ణయించారు. అయితే ఈ సీజన్‌ను మరో రెండు, మూడు వారాలు పెంచే ఆలోచనలో కూడా బిగ్‌బాస్ టీమ్ ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో సరికొత్త నిర్ణయంగా పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X