Bigg Boss 7 Voting: విన్నర్‌ను డిసైడ్ చేసే ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్‌కు షాక్.. ఎవరూ ఊహించని ట్విస్ట్

ఇండియా మొత్తంలోని అన్ని భాషల్లో ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, ప్రసారం అయిన ప్రతి చోటా ప్రభావాన్ని చూపించిన షో మాత్రం బిగ్ బాస్ ఒకటే. అంతలా ఇది హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అన్ని భాషల కంటే తెలుగులో మరింత ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ దేశంలోనే టాప్ రేటింగ్ రాబడుతోంది.

దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు ఇక్కడ ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఇది దాదాపుగా చివరి స్టేజ్‌కు రావడంతో రంజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 12వ వారం ఓటింగ్ గురించి షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!

Bigg Boss Telugu 7 Voting

ఎప్పటికప్పుడు కొత్త ట్విస్ట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వస్తున్నట్లు చెప్పినప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌లో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రేక్షకులకు వినోదం కూడా బాగానే లభిస్తోంది. తద్వారా ఈ సీజన్ రేటింగ్‌ను రాబడుతోంది.

ఎవరెవరు వెళ్లిపోయారు?: ఏడో సీజన్‌లోకి మొత్తం మీద 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్‌, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు ఎలిమినేట్ అయ్యారు. అయితే 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు.

12వ వారం నామినేషన్స్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని నామినేషన్స్ అన్నీ ఎంతో ఫైర్‌గా సాగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఇది చివరి స్టేజ్‌కు రావడంతో ఇంకా రంజుగా మారాయి. అందుకు అనుగుణంగానే 12వ వారం నామినేషన్స్ ఎన్నో గొడవలతో సాగింది. ఇందులో మొత్తంగా శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు.

ఊహించని టిస్ట్ ఓటింగ్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో శివాజి, ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌ టాప్ 5 కంటెస్టెంట్లు అనే పేరు తెచ్చుకున్నారు. దీంతో ఈ ముగ్గురికే ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతూ వస్తోంది. అయితే, 12వ వారంలో మాత్రం ఊహించని విధంగా అమర్‌దీప్ చౌదరికి ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు తాజాగా తెలిసింది. ఈ వారం ఓటింగ్‌తో విన్నర్ అతడే అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Amardeep Chaudhary Leading on Sivaji and Prashanth in 12th Week Voting

టైటిల్ ఫేవరెట్లకు షాక్: ఏడో సీజన్‌లో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఒక టీమ్‌గా ఆడుతున్నారు. అందుకే వీళ్లు ముగ్గురిలో ఒకరు కచ్చితంగా ప్రతి వారం టాప్‌లో నిలుస్తున్నారు. కానీ, ఈ సారి అమర్‌దీప్‌కు ఎక్కువ ఓటింగ్ నమోదు కావడంతో వీళ్ల ముగ్గురికి బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ప్రస్తుతం అమర్‌ తర్వాత పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్‌లు టాప్ 4 ప్లేసుల్లో ఉన్నారని తెలుస్తోంది.

Amardeep Chaudhary Leading on Sivaji and Prashanth in 12th Week Voting

టాప్ 5లో నిలిచేది ఎవరు: 12వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో అమర్‌దీప్ చౌదరి టాప్‌లో, రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్, మూడు స్థానంలో శివాజి, నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్‌లు ఉన్నారని వార్త లీక్ అయింది. ఇక, ఐదో స్థానంలో మాత్రం అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ మధ్య పోటీ ఏర్పడినట్లు తెలిసింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. అర్జున్ ఐదో స్థానంలో, గౌతమ్ ఆరో స్థానంలో ఉన్నారని సమాచారం.

Amardeep Chaudhary Leading on Sivaji and Prashanth in 12th Week Voting

కచ్చితంగా ఈ ఇద్దరే ఔట్: ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో రతికా రోజ్ ఏడో స్థానంలో, సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్విని శ్రీ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. వీళ్లకు మొదటి రోజు నుంచి తక్కువ ఓట్లే పడుతున్నాయి. అంటే ఇప్పటికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో ఎక్కువ శాతం అశ్విని, రతికా రోజ్‌లు ఎలిమినేట్ అయ్యే చాన్సే కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X