Bigg Boss Telugu 7: టైటిల్ ఫేవరెట్ ఏవీ దెబ్బకు షేకవుతున్న ఓటింగ్.. టాప్ 5లో ఉన్నది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకూ ఎవరూ ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్... తొలి వారం నుంచి బుల్లితెర అభిమానులకు గట్టి షాక్ ఇస్తోంది. ముందుగా అంటే మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్.. ఆ తర్వాత నాలుగు వారాల పాటు నలుగురిని ఎలిమినేట్ చేశాడు. ఇక ఐదో వారంలో బిగ్ బాస్ 2.0 పేరుతో వచ్చి మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌస్ లోకి పంపాడు. అంతేకాదండోయ్.. ముందు నాలుగు వారాల్లో ఎమినేట్ అయిన ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చి హౌస్ మేట్స్ తో ఓట్లు వేయించారు.

ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని లోపలికి తీసుకు రావాల్సింది పోయి... ఉల్టాపుల్టా అంటూ అతి తక్కువ ఓట్లు వచ్చిన రతికా రోజ్ తో రీఎంట్రీతో ఇప్పించారు. అలాగే ఏమాత్రం ఉపయోగం లేని గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూంలోకి పంపడం, ఆ తర్వాత 24 గంటల్లోపే తీసుకురావడం చేశారు. ఇఖ ఆ తర్వాత నుంచి అసలు ఆట స్టార్ట్ అయింది. కానీ తమకు నచ్చిన వాళ్లను సేవ్ చేసుకోవాడని ఉల్టాపుల్టా కాన్సెప్ట్ ను వాడుకుంటూ... ఓ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ను ఎత్తేశాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ.. ప్రతీ సీజన్ లో టాప్ 5 వాళ్లనే ఉంచగా.. ఈసారి మాత్రం టాప్ 6 పెట్టారు.

Bigg Boss Telugu 7 Voting Changed After Title Favourite AV Released Check Details

అయితే మొదటి వారంలో ఇంట్లో అడుగు పెట్టిన అమర్ దీప్ యే విన్నర్ గా నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన రెండో వారంలోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకోవడంతో విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. కనీసం ఆయన టాప్ 5లో కూడా ఉండడు అని తేలిపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత ఆయన గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. 12, 13 వారాల్లో అయితే అమర్ దీప్ యే విన్నర్ గా నిలుస్తాడని కూడా అంతా అనుకున్నారు. కానీ అంతలోనే అమర్ దీప్ మరోసాగి నెగిటివిటీ తెచ్చుకుని టాప్ 4కు పడిపోయాడు. రైతుబిడ్డ మొదటి స్థానంలో, శివాజి రెండో స్థానంలో, యావర్ మూడో స్థానంలో ఉన్నారు.

కానీ 15వ వారంలో భాగంగా బిగ్ బస్ టాప్ 6 కంటెస్టెంట్లకు చెందిన బిగ్ బాస్ జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. ముందుగా అమర్ దీప్ వీడియో చూపించిన బిగ్ బాస్ ఆ తర్వాత అంబటి అర్జున్ ది చూపించాడు. ఇక ఈరోజు శివాజిది చూపించబోతున్నట్లు ప్రోమో చూస్తుంటే అర్థం అయిపోతుంది. ఇప్పటికి వచ్చినవి రెండో జర్నీ వీడియోలు కాగా... దానితోనే ఓటింగ్ అంతా ఉల్టాపుల్టాగా మారుతోంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో ఓటింగ్ వస్తోంది. టైటిల్ ఫేవరెట్ అయిన అమర్ దీప్ వీడియో చూసిన అభిమానులు ఫుల్ గా ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 Voting Changed After Title Favourite AV Released Check Details

ఈరోజు వరకు పోల్ అయిన ఓట్లు చూస్తుంటే... టాప్ 1 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇక రెండో స్థానంలో శివాజి ఉండగా... నాలుగో స్థానంలో ఉన్న అమర్ దీప్ మూడో స్థానానికి వచ్చేశాడు. ఏవీ ఎఫెక్ట్ తో యావర్ ను వెనక్కి నెట్టి మరీ మూడో స్థానానికి వచ్చేశాడు. ఇక ప్రస్తుతం నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉండగా... అంబటి అర్జున్ ఐదో స్థానంలో, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో ఉన్నారు. చూడాలి మరి మరో ఐదు రోజుల్లో ఈ ఓటింగ్ ఏమైనా మారుతుందా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X