Bigg Boss 7 Telugu 10th Week elimination ఓటింగ్‌లో భారీ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్లు!
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 10వ వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. ఇంటిలో 10వ వారం కోసం నామినేషన్ ప్రక్రియ వాగ్వాదాలు, గందరగోళాల మధ్య ముగిసింది. అయితే ప్రస్తుత సీజన్ ముగింపుకు చేరువైన నేపథ్యంలో ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్ బరిలోకి రావడంతో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. 10వ వారం ఎవరు వెళ్తారు? ఎవరు సేఫ్ అవుతారనే విషయంలోకి వెళ్తే..
బిగ్‌బాస్ తెలుగు 7 నామినేషన్ ప్రక్రియను రాజమాత కాన్సెప్ట్‌తో ప్రారంభించారు. ఇంటిలో మిగిలిన నలుగురు లేడీ కంటెస్టెంట్లను రాజమాతలుగా మార్చి.. నామినేషన్ ప్రక్రియకు న్యాయమూర్తులుగా మార్చారు. వారి ముందు రెండు గ్రూపులుగా మారి నామినేషన్స్‌లో ఒకరిపైఒకరు కత్తులు దూసుకొన్నారు.

10వ వారంలో బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్న వారిలో బలమైన కంటెస్టెంట్లు ఉన్నారు. నామినేషన్‌లో ఉన్న వారిలో శివాజీ, భోలే షవాలీ, గౌతమ్ కృష్ణ, రతిక, ప్రిన్స్ యావర్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇంటిలో ఒక గ్రూపుకు చెందిన వారిగా భావిస్తున్న అందరూ నామినేషన్‌లో ఉండటం ఓ ట్విస్టుగా కనిపిస్తున్నది.
10వ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత సర్వే పోల్స్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ప్రైవేట్ పోల్స్‌లో శివాజీ భారీగా ఓటింగ్ నమోదు చేసుకొన్నారు. ఐదుగురిలో అత్యధికంగా 35 శాతానికిపైగా ఓట్లు పొంది అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో 17 శాతం ఓటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

ఇక ప్రిన్స్ యావర్ టాప్ ఓటింగ్‌లో మూడో స్థానంలో నిలిచారు. యావర్ 16 శాతం ఓటింగ్, ఆ తర్వాత రతిక రోజ్ 16 శాతం ఓట్లు సాధించారు. భోలే షవాలీ కూడా 16 శాతం ఓటింగ్‌తో ముందుకు కొనసాగుతున్నారు. అయితే ఓటింగ్ నువ్వా నేనా అనే విధంగా సాగడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

బిగ్‌బాస్ తెలుగు 7 ప్రైవేట్ సర్వేల ఓటింగ్ ప్రకారం.. రతిక రోజ్, యావర్, భోలే షవాలీ డేంజర్ జోన్‌లో కనిపిస్తున్నారు. శివాజీ తప్ప అందరి ఓటింగ్ అంతంతా మాత్రంగానే ఉంది. ఓటింగ్‌లో తేడా జరిగితే కంటెస్టెంట్ల తలరాత మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం భోలే షవాలీ, రతిక ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











