Bigg Boss Telugu 7 Week 10th Voting.. ఉల్టాపుల్టాగా ఓటింగ్.. తారుమారైన ఆ ముగ్గురి తలరాత!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంటున్నది. అత్యంత ప్రేక్షకాదరణను సొంత చేసుకొంటూ ఈ షో 10వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ప్రస్తుతం 10వ ఎలిమినేషన్‌కు రెడీ అయ్యారు. సోమవారం ముగిసిన 10వ వారం నామినేషన్ల తర్వాత ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ ఇంటిలో 9వ వారం ఓటింగ్ ఊగిసలాటతో షాకిచ్చే విధంగా ఎలిమినేషన్ జరిగింది. అంతా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఉల్టాపుల్టా ఓటింగ్‌తో టేస్టీ తేజా ఎలిమినేట్ కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టేస్టీ తేజా ఎలిమినేషన్‌తో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను కూడా బయటకు పంపిస్తామని బిగ్‌బాస్ హెచ్చరించారు.

Bigg Boss Telugu 7 Week 10th Elimination: Rathika Rose, Bhole Shavali, Prince Yawar in Danger Zone

ఇక బిగ్‌బాస్ షో ముగింపు దశకు చేరుకొంటున్న సమయంలో కంటెస్టెంట్ల మధ్య భారీ పోటీ నెలకొన్నది. నామినేషన్‌లో ఆ పోటీ స్పష్టంగా కనిపించింది. ఇంటి సభ్యులకు కొత్త పద్దతిలో రాజమాత దర్బార్‌ను ఏర్పాటు చేసి నామినేషన్‌కు తెర లేపారు. ఇంటిలోని నలుగురు లేడి కంటెస్టెంట్లను రాజమాతలుగా కూర్చోబెట్టి దర్బార్‌లో నామినేషన్ ప్రక్రియను ముగించేశారు.

బిగ్‌బాస్ ఇంటిలో 10వ వారంలో అనర్హత లేదంటూ నామినేషన్ చేసిన వారిలో ఐదుగురు ఉన్నారు. ఈ సీజన్లో తొలిసారి తక్కువ సంఖ్యలో నామినేషన్ చేశారు. ఈ సారి ఇంటి నుంచి బయటకు పంపించే వారి కోసం జరిగిన నామినేషన్‌లో శివాజీ, భోలే షవాలీ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ తదితరులు ఉన్నారు. వీరంతా ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఈ సారి ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 7 Week 10th Elimination: Rathika Rose, Bhole Shavali, Prince Yawar in Danger Zone

అయితే బిగ్ బాస్ తెలుగు 4 లో 10వ వారం కోసం జరిగిన ఓటింగ్ ప్రకారం.. శివాజీ టాప్ ఓటింగ్‌ను సొంతం చేసుకొంటున్నారు. ఆయనకు దాదాపు 35 శాతానికిపైగా ఓటింగ్ నమోదైనట్టు స్పష్టమైంది. ఆ తర్వాత అందరూ కొద్ది తేడాతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే నలుగురిలో ఎవరైనా ఎలిమినేట్ కావొచ్చనే విధంగా ఓటింగ్ జరుగుతున్నది.

Bigg Boss Telugu 7 Week 10th Elimination: Rathika Rose, Bhole Shavali, Prince Yawar in Danger Zone

బిగ్‌బాస్ తెలుగు 7 లో 10వ వారం ఎలిమినేసన్ కోసం నామినేషన్‌లో ఉన్న గౌతమ్ కృష్ణ 18 శాతం ఓటింగ్, ప్రిన్స్ యావర్ 16 శాతం ఓటింగ్‌ను, భోలే 16 శాతం ఓటింగ్‌ను, అలాగే రతిక రోజ్ 16 శాతం ఓటింగ్‌ను సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం భోలే, రతిక రోజ్, ప్రిన్స్ యావర్‌లో ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్తితి కనిపించింది.

Bigg Boss Telugu 7 Week 10th Elimination: Rathika Rose, Bhole Shavali, Prince Yawar in Danger Zone

బిగ్‌బాస్ తెలుగు షోలో గత 9 వారాల్లో కనిపించని ఉత్కంఠ ప్రస్తుతం కనిపిస్తున్నది. 10వ వారం ఉల్టాపుల్టాగా ఎలిమినేషన్ కనిపిస్తున్నది. ఎవరు అవుట్ అవుతారనే విషయం బిగ్ ట్విస్టుగా మారింది. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో జరిగే ఓటింగ్ కంటెస్టెంట్లకు కీలకంగా మారనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X