Bigg Boss Telugu 7 Week 11th Voting షాకింగ్‌గా ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ నలుగురు!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 11వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 11వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లు ఇంటి సభ్యుల్లో భారీ వాగ్వాదానికి దారి తీసాయి. అప్పటి వరకు క్లోజ్‌గా ఉన్నవారు ఒక్కసారిగా నామినేట్ చేసుకొన్నారు. అయితే ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారనే విషయంపై జరిగిన ఓటింగ్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటి నుంచి 10వ వారం సింగర్, మ్యూజిక్ కంపోజర్ భోలే షవాలీ ఎలిమినేట్ అయ్యారు. ఇంటి నుంచి ఆయన వెళ్లిన తర్వాత హౌస్‌లో పది మంది మిగిలారు. ఇంకా జరుగబోయే నాలుగు వారాల ఆటలో టాప్ కంటెస్టెంట్లు మిగిలారు. అయితే ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

 Bigg Boss Telugu 7 Week 11th Elimination

ఇక బిగ్‌బాస్ ఇంటిలో 11వ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లోకి వచ్చారు. నామినేషన్‌లో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, రతిక రోజ్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, అశ్వినీ శ్రీ, శోభా శెట్టి, అంబటి అర్జున్ ఉన్నారు. వీరిలో అందరూ టాప్ 5 కంటెస్టెంట్లుగా భావించే వారు కావడం గమనార్హం.

బిగ్‌బాస్ తెలుగు 7లో ప్రస్తుతం జరిగిన ఓటింగ్ ప్రకారం.. ప్రిన్స్ యావర్ అత్యధికంగా 40 శాతం ఓటింగ్ సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత అమర్ దీప్ 20 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇక రతిక రోజ్ మూడో స్థానంలో నిలిచి 14 శాతం ఓట్లు సాధించారు. ఆ తర్వాత ప్రియాంక 7 శాతం ఓటింగ్‌తో 4వ స్థానంలో నిలిచారు.

Gowtham, Ashwini Sri, Shobha Shetty, Arjun Ambati danger Zone

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన వారిలో గౌతమ్ కృష్ణ, అశ్వినీ శ్రీ, శోభా శెట్టి, అంబటి అర్జున్ ఉన్నారు. గౌతమ్ కృష్ణకు 6.5 శాతం, అశ్వినీ వ్రీకి 5 శాతం, శోభా శెట్టికి 5 శాతం, అంబటి అర్జున్‌కు 5 శాతం వరకు ఓటింగ్ నమోదైంది. దాంతో ఈ నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయం స్పష్టమైంది.

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో 11వ ఎలిమినేషన్ కోసం శుక్రవారం వరకు ఓటింగ్ జరుగుతుంది. మరో నాలుగు రోజుల వరకు జరిగే ఓటింగ్‌లో ఓటింగ్‌లో అనూహ్యంగా ఓట్లు సాధించగలిగితే.. గౌతమ్ కృష్ణ, అశ్విని, శోభ, అర్జున్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకొనే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X