Bigg Boss Telugu 7 బావా.. నా మనోభావాలు దెబ్బ తిన్నాయి..నామినేషన్‌లో అశ్విని రచ్చ!
బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో 11వ వారం నామినేషన్ ప్రక్రియ ఘాటుగా సాగింది. ఇంటి సభ్యులను ఒకరికొకరు నామినేట్ చేసుకొంటూ పెడబొబ్బలు పెట్టారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొన్నారు. ఇంటిలో మరోసారి నామినేషన్ల ప్రక్రియ రచ్చ రేపింది. భారీ గందరగోళాల మధ్య నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన విషయాల్లో వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 11వ వారం నామినేషన్‌లో ఇద్దరిని ఎంపిక చేసుకొని.. వారికి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. నామినేట్ చేసేటప్పుడు.. తలపై రెండు సీసాలను పగలగొట్టి నామినేషన్‌ను ముగించాలని చెప్పారు. అలా 11వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

నామినేషన్ ప్రక్రియలో అశ్వినీ శ్రీ, రతిక రోజ్‌ను ప్రియాంక జైన్ నామినేట్ చేశారు. అమర్ దీప్, అర్జున్ అంబటిని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశారు. అంబటి అర్జున్, రతిక రోజ్‌ను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశారు. ప్రియాంక జైన్, అమర్ దీప్‌ను అశ్వినీ శ్రీ నామినేట్ చేశారు. శోభా శెట్టి, అమర్ దీప్‌ను యావర్ నామినేట్ చేశారు. యావర్, రతిక రోజ్‌ను శోభా శెట్టి నామినేట్ చేశారు.
ఇక గౌతమ్, యావర్‌ను అమర్ దీప్ నామినేట్ చేశాడు. శోభాశెట్టి, ప్రియాంక జైన్‌ను రతిక రోజ్ నామినేట్ చేయగా.. అంబటి అర్జున్ తన నామినేషన్‌లో భాగంగా శోభాశెట్టి.. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశారు. శివాజీ నామినేషన్ ప్రక్రియను మొదలుపెడుతూ గౌతమ్ కృష్ణను, ప్రియాంక జైన్‌ను నామినేట్ చేయడంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది.
అయితే నామినేషన్ ప్రక్రియలో అశ్వినీకి, ప్రియాంక జైన్‌కు మధ్య వాగ్వాదం భారీగా జరిగింది. ఓ దశలో నీవు ఏమైనా తోపువా? అంటూ అశ్వినీ నిలదీసింది. ఓ దశలో తన వాదన వినిపిస్తూ.. మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ నోరు జారింది.అయితే పాట నాకు గుర్తుకు వచ్చిందని చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 11వ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. ప్రిన్స్ యావర్, అమర్ దీప్, రతిక రోజ్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, అశ్వినీ శ్రీ, శోభా శెట్టి, అంబటి అర్జున్ నామినేట్ అయ్యారు. దాంతో టాప్ కంటెస్టెంట్లు అందరూ నామినేషన్‌లో ఉండటం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











