Bigg Boss Telugu 7 Elimination 14 వారంలో బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్!

దేశవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ముగింపు దశకు చేరుకొన్నది. ఇంకా రెండు వారాల్లోనే ఈ షో విజేత ఎవరనేది స్పష్టం కానున్నది. ఈ క్రమంలో 14వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం నామినేషన్లలో ఉన్నది ఎవరు? తాజా సర్వే ఓటింగ్ ప్రకారం ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 14వ వారం గేమ్‌ను బిగ్‌బాస్ ఆసక్తికరంగా మార్చాడు. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకొన్న మొట్టమొదటి కంటెస్టెంట్‌గా అంబటి అర్జున్ రికార్డు సొంతం చేసుకొన్నాడు. దాంతో ఈ వారం అర్జున్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక మిగితా వారందరూ నామినేషన్‌లో ఉండటం షాకింగ్‌గా అంశంగా మారింది.

https://telugu.filmibeat.com/gossips/is-animal-fame-tripti-dimri-getting-huge-offers-from-tollywood-producers-here-is-details-128973.html

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో నామినేషన్ల ప్రక్రియ రంజుగా సాగింది. ఈ షోలో ఒకరికొకరు భారీగా దుమ్మెత్తి పోసుకొన్నారు. చివరకు ఒకరినొకరు నామినేట్ చేసుకొన్నారు. చివరగా ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి ఉన్నారు.

అయితే రెండో రోజు సర్వే ఓటింగ్ వివరాల్లోకి వెళితే..పల్లవి ప్రశాంత్‌కు భారీగా ఓటింగ్ నమోదు అవుతున్నది. పల్లవి ప్రశాంత్ 40 శాతం ఓటింగ్‌తో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ 20 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక శివాజీ 19 శాతంతో మూడో స్థానంలో, ఇక అమర్ దీప్ 16 శాతంతో 4వ స్థానంలో నిలిచి ఫినాలేకు తమ స్థానాలను పదిల పరుచుకొన్నారు.

Bigg Boss Telugu 7 Week 14th Elimination: Priyanka Jain and Shobha Shetty in Danger Zone

ఇక డేంజర్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ మారింది. ప్రియాంక 5 శాతం ఓట్లతో 5వ స్థానంలో ఉండగా, శోభా శెట్టి 4 శాతం ఓట్లతో చివరి స్థానంలో డేంజర్ జోన్‌లో ఉండటమే కాకుండా ఎలిమినేషన్ కత్తి కింద ఉన్నారు.

Bigg Boss Telugu 7 Week 14th Elimination: Priyanka Jain and Shobha Shetty in Danger Zone

బిగ్‌బాస్ తెలుగు 7 సర్వే ఓటింగ్ వివరాల్లోకి వెళితే.. గత కొద్ది వారాలుగా శోభా శెట్టి ఎలిమినేషన్ నుంచి తప్పించుకొంటున్నది. ఈ వారం కూడా ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప శోభా శెట్టి సేఫ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వారం ప్రియాంక జైన్, శోభా శెట్టిలో ఒకరు తప్పనిసరిగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X