Bigg Boss 7 Week 5th Nominations కత్తులతో కసి తీరా పొడుచుకొన్న కంటెస్టెంట్లు.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ సక్సెస్‌పుల్‌గా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే నలుగురు ఫీమేల్ కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామని, రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఐదోవారం ఇంటి నుంచి బయటకు పంపించేందుకు నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ ప్రారంభించారు. ఐదో వారం నామినేషన్ ప్రక్రియ ఉద్వేగ భరితంగా, వివాదాస్పద వాదనలతో సాగినట్టు కనిపించింది. ఐదో వారం బిగ్‌బాస్ తెలుగు నామినేషన్ ప్రక్రియ వివరాల్లోకి వెళితే..
కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ హెచ్చరిక: బిగ్‌బాస్ తెలుగు 5 షోలో సరైన కారణాలు చెప్పకుండా నామినేషన్ వేయడం వల్ల గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో బిగ్‌బాస్ ముందే కంటెస్టెంట్లను హెచ్చరించాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మీరు సరైన కారణాలు చెప్పి కంటెస్టెంట్లను నామినేట్ చేస్తారని బిగ్‌బాస్ ఆశిస్తున్నారు అని ఇంటి సభ్యులకు చెప్పారు.

అమర్ దీప్ వర్సెస్ శివాజీ: నామినేషన్ ప్రక్రియలో అమర్ దీప్, శివాజీ మధ్య భారీగానే వాగ్వాదం చోటు చేసుకొన్నట్టు కనిపించింది. ఒక అన్న, తమ్ముడు ఓ మంత్రి తమ సిబ్బందితో కలిసి బ్యాంక్ దొపిడికి వెళ్లారు. కానీ ఒక్కడు మాత్రం అందర్నీ చంపుకొంటూ వెళ్లి ఒక్కడే బ్యాంక్ నుంచి బయటకు వచ్చాడు. గేమ్‌లో కూడా అందర్నీ ఓడించి ఒక్కడే గెలుస్తాడు అని అమర్ దీప్ పిట్ట కథ చెప్పాడు. దాంతో రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే.. చిన్న భార్య మంచిది కాదు అని అర్దం కాదు అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చాడు.
ప్రియాంకతో శుభ శ్రీ ఫైట్: ప్రియాంకను శుభ శ్రీ నామినేట్ చేస్తూ.. ఇంట్లో గ్రూపిజం చేస్తున్నారు అని ఆరోపించింది. దాంతో ఎవరెవరూ గ్రూప్‌గా ఏర్పడ్డారో చెప్పు అంటూ ప్రియాంక నిలదీసింది. ఆ గ్రూప్‌లో ఎవరు ఉన్నారో పేర్లు చెప్పండి అంటూ ప్రశ్నించింది. దాంతో నాకు అనిపిస్తున్నది అంటూ శుభ శ్రీ సమాధానం చెప్పింది. నీకు అనిపించింది కరెక్ట్ అని అనుకోకు అంటూ ప్రియాంక కౌంటర్ ఇచ్చింది.
గ్రూపిజం గురించి టెస్టీ తేజ: నామినేషన్స్ సందర్భంగా గ్రూపిజం గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా టేస్టీ తేజ మాట్లాడుతూ.. ఓ ముగ్గురు ముందుగా అనుకొని.. మరో ముగ్గురిని నామినేట్ చేస్తే అది గ్రూపిజం అంటూ తన వాదన వినిపిస్తే.. అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి, ఆట సందీప్ చప్పట్లు కొడుతూ కనిపించారు. ఈ నలుగురు ఓ గ్రూపుగా ఏర్పడ్డారని విషయంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.

కడుపులో కత్తులతో గుచ్చుకొని: ఇదిలా ఉండగా, కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ షాకిస్తూ ఓ వార్నింగ్ లాంటిది ఇచ్చారు. కంటెస్టెంట్లుగా ఉన్న వారు హౌస్‌మేట్స్‌గా మారుతారా? లేదా ఇంటి నుంచి బయటకు వెళ్తారా అనేది మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్‌బాస్ కఠినంగా చెప్పాడు. దాంతో కంటెస్టెంట్లందరూ తెల్లముఖాలు వేసి ఒకరినొకరు చూసుకొన్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్బంగా తమ మెడకు వేసుకొన్న బోర్డుపై సరిగ్గా కడుపు భాగంలో కత్తులతో పొడుచుకొని కసితీరా నామినేట్ చేసుకొన్నారు.
నామినేషన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు: ఇక ఐదోవారం నామినేషన్ విషయానికి వస్తే.. మొత్తం 7 గురు సభ్యులు నామినేట్ అయ్యారు. శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శుభ శ్రీ, టేస్టీ తేజ నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో ఓటింగ్ ప్రక్రియ రసవత్తరంగా మారింది.


Click it and Unblock the Notifications











