Bigg Boss Telugu 7 Week 6th Voting నామినేషన్లలో ఏడుగురు.. డేంజర్ జోన్‌లో టాప్ లేడి కంటెస్టెంట్!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో ఆరో వారం నామినేషన్ రచ్చ భారీగా జరిగింది.సాధారణంగా నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంటే 6వ వారం కంటెస్టెంట్ల మధ్య భారీగా గొడవ జరిగింది. నామినేషన్‌లో ఆటగాళ్లు, పోటుగాళ్లుగా రెండు జట్లను విభజించారు. రెండు జట్ల మధ్య నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? కంటెస్టెంట్స్, పోటుగాళ్లు ఎవరు? అనే వివరాలతోపాటు.. తొలి రోజు ఓటింగ్ డిటైల్స్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 2.O గ్రాండ్‌గా జరిగింది. ఇంటిలోకి 5 గురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించారు. అంబటి అర్జున్, నయని పావని, అశ్వినీ శ్రీ, పూజా, భోలే షవాలీ ఇంటిలోకి అడుగుపెట్టారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంట్లోకి వచ్చిన వారిని పోటుగాళ్లుగా, ఇంటిలో ఉన్న వాళ్లను ఆటగాళ్లుగా విభజించారు.

ఇక 6వ వారం నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ ప్రారంభిస్తూ.. పోటుగాళ్లు తమ కారణాలను చెబుతూ ఇద్దరు ఆటగాళ్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది అని రూల్స్ చెప్పారు. అలాగే కంటెస్టెంట్లు ఇంటిలోకి వచ్చిన పోటుగాళ్లను నామినేట్ చేశారు. అలా ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ అత్యంత గందరగోళం మధ్య సాగింది. ప్రతీ పోటుగాడు, తమకు నచ్చని కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న కంటెస్టెంట్ అంటూ నామినేట్ చేస్తూ కారణాలను చెప్పారు.
బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ అనంతరం మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. 6వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన ప్రక్రియలో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, నయని పావని, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ, పూజా మూర్తి, శోభా శెట్టి నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్ నుంచి బయట పడేందుకు బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎలా అలరిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
బిగ్‌బాస్ షో తొలివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ఓటింగ్ లైన్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజే భారీగా ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌లో ఊహించని కంటెస్టెంట్లు భారీగా ఓటింగ్ సాధించారు. ఆరో వారం నామినేషన్‌లో యావర్, అమర్ దీప్, నయని పావని, టేస్టీ తేజ టాప్ ఓటింగ్ సాధించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 6వ వారం కోసం జరిగిన ఎలిమినేషన్‌లో నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్ దాదాపు 50 శాతం ఓటింగ్, అమర్ దీప్ 20 శాతం, నయని పావని 15 ఓట్లు, టేస్టీ తేజ 12 శాతం, అశ్వినీ శ్రీ 6 శాతం, శోభా శెట్టి 5 శాతం ఓటింగ్ సాధించారు.
బిగ్‌బాస్ తెలుగు 7 షో నుంచి గత ఐదువారాల్లో 5 గురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికా రోజ్, శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నామినేట్ అయిన వారిలో కూడా ఇద్దరు మహిళా కంటెస్టెంట్లు డేంజరర్ జోన్‌లో ఉండటంతో ఈసారి కూడా లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా? అనే విషయంపై చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











