Bigg Boss Telugu 7 Elimination Voting ఉల్టా పుల్టాగా ఓటింగ్.. మారిన తలరాతలు, డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 6వ వారం ఎలిమినేషన్‌‌కు సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. రోజు రోజుకు ఓటింగ్ తీరు తారుమారు అవుతుండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అయితే ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు వచ్చిన ఓటింగ్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 6వ వారం ప్రత్యేకంగా నిలిచింది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా ఇంటిలోకి వచ్చారు. ఈ ప్రక్రియను బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 2.O అని పేర్కొన్నారు. ఇంటిలోకి కొత్తగా ఐదుగురు రావడంతో బిగ్‌బాస్ హౌస్‌ కళకళలాడింది.

Bigg Boss Telugu 7 Week 6th Elimination day 2 Voting: Pooja Murthy, Nayani Pavani, Shobha Shetty in danger

బిగ్‌బాస్ ఇంటిలోకి ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా వచ్చిన వారిలో అంబటి అర్జున్, భోలే షవాలే, నయని పావని, అశ్వినీ, పూజా ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారిని పోటుగాళ్లు అంటూ టీమ్‌గా విభజించారు. పోటుగాళ్లు, కంటెస్టెంట్ల మధ్య నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. వాదోపవాదాల మధ్య నామినేషన్ ప్రక్రియ ఉద్రిక్త పూరిత వాతావరణంలో ముగిసింది.

బిగ్‌బాస్ ఇంటి నుంచి 6వ వారం బయటకు వెళ్లడానికి అర్హత ఉందనే కారణంతో నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, టేస్టీ తేజ, శోభా శెట్టి, నయని పావని, అశ్వినీ శ్రీ, పూజా ఉన్నారు. దాంతో టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో ఓటింగ్ ప్రక్రియ రచ్చగా మారింది.

Bigg Boss Telugu 7 Week 6th Elimination day 2 Voting: Pooja Murthy, Nayani Pavani, Shobha Shetty in danger

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఆరోవారం నామినేట్ ఉన్న కంటెస్టెంట్లకు పోలైన ఓట్ల వివరాల్లోకి వెళితే.. ప్రిన్స్ యావర్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నారు. ప్రిన్స్ యావర్‌కు అత్యధికంగా 40 శాతం ఓట్లు, అమర్ దీప్‌ 20 శాతం ఓట్లతో రెండో స్థానంలో, 15 శాతం ఓట్లతో టేస్టీ తేజ మూడో స్థానంలో నిలిచారు.అశ్వినీ శ్రీ 10 శాతం, నయని పవని 8 శాతం, పూజా మూర్తి 5 శాతం, శోభా శెట్టి అత్యల్పంగా 5 శాతంతో చివరి స్థానంలో నిలిచారు.

Bigg Boss Telugu 7 Week 6th Elimination day 2 Voting: Pooja Murthy, Nayani Pavani, Shobha Shetty in danger

ఇక రెండో రోజు నమోదైన ఓటింగ్ సరళీని బట్టి చూస్తే.. శోభా శెట్టి, పూజా మూర్తి, నయని పవని డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే చివరి రెండు రోజుల్లో ఓటింగ్‌లో భారీ మార్పులు జరిగితే తప్ప ఈ ముగ్గురు డేంజర్ జోన్ నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఓటింగ్ మెరుగు పరుచుకొని ఈ ముగ్గురిలో ఒకరు సేఫ్ అవుతారా? ఎలిమినేట్ అవుతారా అనేది వేచి చూడాల్సిందే.

Bigg Boss Telugu 7 Week 6th Elimination day 2 Voting: Pooja Murthy, Nayani Pavani, Shobha Shetty in danger

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో అందరూ లేడీ కంటెస్టెంట్స్ ఉండటం గమనార్హం. అయితే ఈ వారం ఓటింగ్ చూస్తే.. 6వ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X