Bigg Boss Telugu 7 Elimination.. టాప్ కంటెస్టెంట్‌‌కు ఎలిమినేషన్ తప్పదా? 6వ వారం కూడా మహిళనే అవుటా?

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 6వ వారం ముగింపు దశకు చేరుకొన్నది. ఇంటిలోకి వచ్చిన 5 కొత్త కంటెస్టెంట్లు, గతంలో ఉన్న పాత కంటెస్టెంట్ల మధ్య ఫన్ మూమెంట్స్, గొడవలతో సినిమా ఆసక్తికరంగా సాగుతున్నది. అయితే ఈ వారం ఎలిమినేషన్ విషయం అటెన్షన్ పెరిగింది. ఈ వారం ఎవరు వెళ్లిపోతారనే ఊహాగానాల మధ్య జరిగిన ఓటింగ్ షాకింగ్ కలిగించింది. 6వ వారం ఎలిమినేషన్ కోసం ఓటింగ్ ఎలా జరిగింది? ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయంలోకి వెళితే.

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 7 సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టాగా మారుతున్నాయి. 2.O అంటూ కొత్త ఫార్మాట్‌కు తెర లేపారు. ఏకంగా 5 గురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశపెట్టి ఆటపై మరింత ఆసక్తిని బిగ్‌బాస్ రేపాడు. అలాగే ట్విస్టులు, సంచలన నిర్ణయాలతో బిగ్‌బాస్ షోపై మరింత క్యూరియాసిటీ పెంచారు.

Bigg Boss Telugu 7 Week 6th Elimination

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 6వ వారం నామినేషన్స్ వాదోపవాదనల మధ్య సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న కంటెస్టెంట్లు అంటూ ఇంటి సభ్యులు తమకు తోచిన విధంగా కారణాలు చెప్పి నామినేట్ చేశారు. దాంతో ఈ వారం నామినేషన్‌లో మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు.

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 6వ వారం ఎలిమినేషన్‌ కోసం నామినేట్ అయిన వారిలో శోభా శెట్టి, టేస్టీ తేజ, నయని పవని, అమర్ దీప్, పూజా మూర్తి, అశ్వినీ శ్రీ, ప్రిన్స్ యావర్‌ ఉన్నారు. ఈ వారం కొత్తగా ఇంటిలో చేరిన ముగ్గురితోపాటు పాత కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అనే అగ్ని పరీక్షకు సిద్దమయ్యారు.

 Shobha Shetty on verge of Elimination

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 4వ రోజు ఓటింగ్ విషయానికి వస్తే.. అత్యధికంగా ఓట్లు సాధించి ప్రిన్స్ యావర్ టాప్‌లో ఉన్నారు. ప్రిన్స్ దాదాపు 35 శాతం ఓట్లను సాధించాడు. ఇక రెండో స్థానంలో అమర్ దీప్ 22 శాతం ఓట్లు, టేస్టీ తేజ 15 శాతం ఓట్లు రాబట్టారు. ఇక కొత్తగా ఇంటిలోకి వచ్చిన అశ్వీని శ్రీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ 10 శాతానికి పైగా ఓట్లు రాబట్టింది. నయని పవని 7 శాతం, పూజా మూర్తి 6 శాతం, శోభా శెట్టి 5 శాతానికి కంటే తక్కువగా ఓట్లు రాబట్టారు.

బిగ్‌బాస్ తెలుగు 7 మొదలైనప్పటి నుంచి ఎలిమినేట్ అయిన వారందరూ మహిళలే. ఎలిమినేట్ అయిన వారిలో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇక ఈ వారం కూడా రికార్డుస్థాయిలో మహిళనే ఎలిమినేట్ కావడం తథ్యంగా కనిపిస్తున్నది. శోభా శెట్టిని ఇంటి నుంచి బయటకు పంపిస్తారా? లేదా బిగ్‌బాస్ ఏదైనా ట్విస్టు ఇస్తారా వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X