Bigg Boss Telugu Week 7 Voting డేంజర్ జోన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీలు,ఈ వారం కూడా లేడి కంటెస్టెంట్ ఎలిమినేషనా?
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 7వ వారం నామినేషన్ల రచ్చ ఊహించని విధంగా సాగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్లకు, ఇతర కంటెస్టెంట్లకు మధ్య భారీ వాగ్వాదమే జరిగింది. కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు భారీగా ఆరోపణలు చేసుకొన్నారు. భావోద్వేగాల మధ్య ఇంటి సభ్యులు, కోపతాపాల మధ్య నామినేషన్ ప్రక్రియను ముగించారు. అయితే ఈ వారం నామినేట్ అయిందెవరు? ఎవరెవరికీ ఓటింగ్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ మొదలైనప్పటి నుంచి ఆశ్చర్యకరంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. ఉల్టా పుల్టా సీజన్ అని చెప్పినట్టే.. ఊహకు అందకుండా ఎలిమినేట్ అయ్యారు. గత 6వ వారాల షోలో మొత్తం ఆరుగురు లేడి కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో నెటిజన్లకు చాలా సందేహాలు వచ్చాయి. ఇంటిలో వీక్ కంటెస్టెంట్లను ఉంచుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బయటకు పంపిస్తున్నారనే ఆరోపణలు భారీగానే సోషల్ మీడియాలో కనిపించాయి.

నెటిజన్లు, అభిమానుల ఆరోపణలకు తగినట్టే.. ఇంటి నుంచి సింగర్ దామిని, రతిక రోజ్, శుభ శ్రీ, నయని పవని లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బయటకు పోవడం అనుమానాలకు మద్దతు పలికేలా చేసింది. ఇక షకీలా, కిరణ్ రాథోడ్ సీనియర్లు కావడం వల్ల వారి ఎలిమినేషన్‌పై పెద్దగా చర్చ జరగలేదు. ఇక 7వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తిగా మారిన సమయంలో తాజా నామినేష్ మరింత క్యూరియాసిటీని పెంచింది.
ఇక బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత 7 గురు నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, భోలే షవాలే, అశ్వినీ శ్రీ, పూజా మూర్తి, అమర్ దీప్ నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం భోలే షవాలే, అశ్వినీ శ్రీ, పూజా మూర్తి బలహీనమైన కంటెస్టెంట్లు కనిపించారు.

బిగ్‌బాస్ 7వ వారం నామినేషన్ తర్వాత జరుగుతున్న ఓటింగ్ చాలా సెన్సేషన్‌గా నమోదు అవుతున్నది. ఈ వారం నామినేషన్‌లో పల్లవి ప్రశాంత్‌కు భారీ ఓటింగ్ జరుగుతున్నది. ప్రశాంత్‌కు దాదాపు 50 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత అమర్ దీప్ 17 శాతం ఓటింగ్, గౌతమ్ కృష్ణ 9 శాతం ఓట్లు తెచ్చుకొన్నారు. టేస్టీ తేజకు 9 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక చివరి మూడు స్థానాల్లో నిలిచిన వారిలో భోలే షవాలీ 7 శాతం ఓట్లు, అశ్వినీ శ్రీ 6 శాతం, పూజా మూర్తి 3 శాతం ఓట్లతో నమోదు చేసుకొన్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ కావడానికి అవకాశం ఉన్న జాబితాలో ఈ ముగ్గురు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ వారం కూడా లేడి కంటెస్టెంట్ కావడం తథ్యంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











