Bigg Boss Telugu 7 పల్లవి ప్రశాంత్ కుండ బద్దలు కొట్టిన సందీప్.. నామినేషన్స్‌లో 7 మంది.. ఎవరెవరు ఉన్నారంటే?

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 7వ వారం నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య భాగీ గలాట చోటు చేసుకొన్నది. ఒకరినొకరు నామినేషన్ చేసుకోనే సమయంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైనట్టు కనిపించాయి. ముఖ్యంగా ఇంటిలో అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ఆట సందీప్, పల్లవి ప్రశాంత్ మధ్య భారీగా వాదనలు జరిగాయి. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగింది? ఎవరు నామినేట్ అయ్యారనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చిన నయన పవని తన అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇంటిలో చలాకీగా, అలాగే మంచి ఎనర్జీతో కనిపించిన నయని.. టాప్ 5లో ఉండటం ఖాయమనే ఫీలింగ్ కలిగించింది. అయితే ఆమె తొలివారమే ఎలిమినేట్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Nayani Pavani Eliminated From Bigg Boss

బిగ్‌బాస్ తెలుగు 7 తెలుగు 7వ వారం నామినేషన్‌లో కంటెస్టెంట్లందరూ భోలే షవాలే, అశ్వినీ శ్రీని టార్గెట్ చేశారు. ఇంటిలో మీరు ఎందుకు ఉంటున్నారు... హద్దు మీరి మాట్లాడుతున్నారు అంటూ ఆరోపిస్తూ చాలా మంది పాయింట్ అవుట్ చేశారు. ఈ సందర్బంగా కంటెస్టెంట్ల తీరుపై అశ్వినీ శ్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. భోలే షవాలే మాత్రం కంటెస్టెంట్ల మాటలను తేలికగా తీసుకొన్నాడు. ప్రియాంక జైన్ తన కారణాలను చెబితే.. నిన్ను చూస్తుంటే జోక్ అనిపిస్తున్నది అని భోలే అన్నాడు.

నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లు నామినేట్ చేయడానికి వస్తుంటే.. రారా.. రండి. నామినేట్ చేయండి అంటూ భోలే షవాలే వెల్‌కమ్ చెప్పారు. మీరు ఇంటిలోకి ఎందుకు వచ్చారు? అని అంబటి అర్జున్ అంటే.. నేను రెండు వారాలు ఉన్నప్పటికీ.. నేను నాలా ఉంటాను. ఉన్నన్నీ రోజులు మంచిగా ఉండి బయటకు వెళ్తాను అని భోలే షవాలే అన్నాడు. దాంతో నీవు ఈ ఇంటిలో ఉండటానికి అర్హత లేదు అంటూ అంబటి నామినేట్ చేశారు.

Bigg Boss Telugu 7 Week 7 Eliminations: full list of 9 members Nominated Contestants

ఇక ఆట సందీప్, పల్లవి ప్రశాంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.బరాబర్ అలాగే అంటా అని ప్రశాంత్ ఒంటికాలిపై లేచాడు. గట్టిగా మాట్లాడకు.. నీకంటే గట్టిగా మాట్లాడగలను. నీవు విను అంటే.. నీవు విను.. అంటూ ఆట సందీప్, ప్రశాంత్ గొడవ పెట్టుకొన్నాడు. టేస్టీ తేజ, ప్రశాంత్ మధ్య వాడివేడిగా గొడవ జరిగింది. ఇలా ఇంటిలో వాదోపవాదనలతోపాటు అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్, ఆట సందీప్ ఆడుతున్న గ్రూపిజం ఆటను వేలెత్తి చూపారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 7వ వారం నామినేషన్‌లో ఉన్న వారి జాబితా ఇదే.. భోలే షవాలే, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, టేస్టీ తేజ, శోభాశెట్టి, అశ్వినీ శ్రీ నామినేట్ అయ్యారు. మొత్తం ఏడుగురు నామినేషన్‌లోకి రావడంతో ఎవరు ఇంటి నుంచి వెళ్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X